ఎందరో జీవితాలకు వెలుగునిచ్చి ఎమ్మిగనూరు ప్రాంత ప్రజల గుండెల్లో... చిరస్మరణీయుడుగా నిలిచిన మహనీయుడు, చేనేతల పితామహుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప. ఆయన ఆశయాలు నిరంతరం కొనసాగాలంటే.. అది కేవలం ఎం.జి. కుటుంబ వారసుడు డాక్టర్ మాచాని సోమనాథ్ తోనే సాధ్యమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప బంగ్లాలో ఏర్పాటైన సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. పరిశ్రమలను స్థాపించి, చేనేతల పితామహుడుగా పేరుగాంచి 1954 లో భారత రాష్ట్రపతి చేత పద్మశ్రీ…
కృష్ణా జిల్లాలోని గుడివాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా మైనార్టీలు చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో , వైయస్ఆర్సీపీలో 500 మంది టీడీపీకి మైనార్టీలు జాయిన్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.
నూజివీడు టీడీపీలో పార్థసారధి రచ్చ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి నూజివీడు టీడీపీ నేతలకు ఫోన్లు చేసి.. నూజివీడు సీటు తనకే అని సహకరించాలని ఫోన్ లో కోరారు పార్థసారధి. సారధి ఫోన్ కాల్స్ పై నూజివీడు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరక ముందే సారధి తమ వాళ్ళకు ఫోన్లు చేయటం సరికాదని సూచించారు. సీటు ఏమన్నా ఇస్తే పార్టీ ప్రకటన ఉంటుంది..…
Chandrababu Special Message to TDP Leaders over Congress Victory in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో ఉండగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు కీలక సందేశం ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సందేశం అంటూ ఈ సమాచారాన్ని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.…
గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.. సీఎంలుగా వైఎస్ఆర్, వైఎస్ జగన్.. గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు... 14ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు..? అని నిలదీశారు.
నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.