ఎందరో జీవితాలకు వెలుగునిచ్చి ఎమ్మిగనూరు ప్రాంత ప్రజల గుండెల్లో… చిరస్మరణీయుడుగా నిలిచిన మహనీయుడు, చేనేతల పితామహుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప. ఆయన ఆశయాలు నిరంతరం కొనసాగాలంటే.. అది కేవలం ఎం.జి. కుటుంబ వారసుడు డాక్టర్ మాచాని సోమనాథ్ తోనే సాధ్యమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప బంగ్లాలో ఏర్పాటైన సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. పరిశ్రమలను స్థాపించి, చేనేతల పితామహుడుగా పేరుగాంచి 1954 లో భారత రాష్ట్రపతి చేత పద్మశ్రీ జాతీయ అవార్డు అందుకుని ఎమ్మిగనూరు ప్రాంతాన్ని రాజకీయంగా, సామాజికంగా, పారిశ్రామికంగా జాతీయ చిత్రపటంలో ఇనుమడింపజేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
Ghobi Manchuria : గోబీని ఇష్టంగా లాగిస్తున్నారా?.. ఇది వింటే షాక్ అవుతారు..
ఎమ్మిగనూరు ప్రాంతంలో పేద వర్గాలను, నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా 1) ది ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్, 2) ది ఎమ్మిగనూర్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్, 3) ది ఎమ్మిగనూరు కో- ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ 4) ది ఎమ్మిగనూరు లెదర్ వర్కర్స్ కో- ఆపరేటివ్ కాటేజ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్, 5) ది ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ మిల్క్ సప్లై సొసైటీ, ది ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ, 6) ది ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (వై.డబ్ల్యు.సి.యస్.) స్థాపించారని గుర్తు చేశారు. చేనేతలు మగ్గాలు నేసేందుకు విస్తారంగా ఉండేలా రూపకల్పన చేసి వందల మంది చేనేత కార్మికులకు 0.11 సెంట్లు ప్రకారం స్థలమును మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి వీ వర్స్ కాలనీ రూపొందించడమే కాకుండా ఎమ్మిగనూరు నియోజకవర్గంతో పాటు చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేలా విలువైన స్థలాలను దానం చేసి పాఠశాలలు, వైద్యశాలలు నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రిని కలిసిన హను-మాన్!
మహనీయుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప స్ఫూర్తితో.. వారి వంశానికి చెందిన నాలుగవ తరం (ముని మనవడు) మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ యం.యస్.శివన్న మనువడు అయిన డాక్టర్ మాచాని సోమనాథ్ ప్రజా సేవలో కొనసాగడానికి, పద్మశ్రీ మాచని సోమప్ప స్పూర్తితో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. స్థానికుడు, నీతివంతమైన పాలన అందించడానికి విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి ఎం.జి. కుటుంబ వారసుడైన డాక్టర్ మాచాని సోమనాథ్ ను చేనేతలతోపాటు, అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. ఎమ్మిగనూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో.. పద్మశ్రీ మాచాని సోమప్ప, ఆయన తనయుడు యం.యస్. శివన్నల పాత్ర ఎంతో ఉందన్నారు. నేడు కొందరు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకున్న స్థానికేతరులు మహనీయుడైన, చేనేతల పితామహుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్పను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు హాయంలో ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 91.31 ఎకరముల భూమిని “టెక్స్ టైల్” పార్కు కోసం కేటాయిస్తే..! దానిని రద్దుపరిచి ఇతర జిల్లాలకు తరలించి, చేనేతలను మోసం చేసిన వారే నేడు “చేనేత బాంధవ్యుల ఆత్మీయ సమ్మేళనం” పేరుతో మీటింగ్ ఏర్పాటు చేయడం మరోసారి మోసం చేయడమేనని, దీనిని చేనేతలు నమ్మరని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు.