Police Raids on TDP Leaders Houses: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు.. తెలుగుదేశం పార్టీ మహిళా నేత విజితారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.. ఇక, నెల్లూరు సిటీలోని మాజీ మంత్రి నారాయణ ఇంటితో పాటు.. పలువురు టీడీపీ నేతల ఇళ్లలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ ఇంటితో పాటు దాదాపు 15 మంది టీడీపీ నేతల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.. అయితే, ఈ సోదాల్లో పోలీసులకు స్వల్ప మొత్తంలోనే నగదు దొరికినట్టుగా చెబుతున్నారు..
Read Also: Mylavaram: మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు..
నెల్లూరులోని పలువురు టీడీపీ నేతలు.. మాజీ మంత్రి నారాయణ మిత్రుల ఇళ్లల్లో జరిగిన పోలీసుల సోదాల్లో.. నగదుతో పాటు అమరావతి భూములకు సంబంధించిన పత్రాలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.. కొందరి ఇళ్లల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.. అమరావతి భూములకు సంబంధించిన డాకుమెంట్స్ ఉన్నాయా? అని పరిశీలించారట.. ఈ సోదాలు సంబంధించిన వివరాలను మధ్యాహ్నం ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడిస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.. మరోవైపు.. విజితారెడ్డి ఇంట్లో సోదాల విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆమె నివాసానికి చేరుకున్నారు.. ఆయన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. వారితో వాగ్వాదానికి దిగారు.