చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. జైల్లో బంధించిన తీరును గవర్నర్ నజీర్ కు వివరించామని అచ్చెన్నాయుడు చెప్పారు. ముందు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తామని సీఐడీ చేస్తున్న సిగ్గులేని వాదనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.. చంద్రబాబుపై పెట్టిన స్కిల్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని వివరించాం..
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గవర్నరుకు తెలుగు తమ్ముళ్లు వివరించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా జైల్లో ఎవరు పెట్టారు చంద్రబాబును అని ఆయన ప్రశ్నించారు.
మధు ఖోడా, సిబు సోరేన్, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు విషయంలో కూడా అంతే.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ కలిసి వేల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారు అంటూ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 800 కోట్ల రూపాయల విలువైన పేదల భూములను దోచేశారు.. త్వరలోనే నారాయణ కూడా అరెస్టు అవుతారు.. అందుకే ఆయనకు భయం పట్టుకుంది..
టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలకు వైసీపీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ కౌంటర్ ఇచ్చారు. జిల్లా పరువు దిగజారిపోయిందన్న గద్దె విమర్శలును ఆయన ఖండించారు. టీడీపీ హయాంలో కాల్ మని, సెక్స్ రాకెట్ తో జిల్లా పరువు పోయింది.. కృష్ణా జిల్లా పరువును నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని ఆయన అన్నారు.