Kodali Nani: టీడీపీకి కొడాలి నాని సవాల్.. అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణా జిల్లా గుడివాడలో ముస్లిం సంచారజాతుల బీసీ(ఈ) కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముస్లిం సోదరులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ గురించి చంద్రబాబు, టీడీపీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.. సీఎంలుగా వైఎస్ఆర్, వైఎస్ జగన్.. గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు… 14ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు..? అని నిలదీశారు.
Read Also: Telangana Assembly Election: తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ ఇచ్చిన బీఎస్పీ
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ప్రజలను ఆత్మబంధువులుగా చూసే వైఎస్ జగన్.. గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి 4 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు కొడాలి నాని.. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారు. ధనికుల కార్లు బ్రేకులు వేయకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్ కు తాము చెప్పాం అన్నారు. ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారు… త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దే 99 శాతం కుటుంబాల సమస్యలు పరిష్కారంమవుతున్నాయని తెలిపారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!