టీడీపీ పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ విధానాలు.. చేపట్టాల్సిన ఆందోళనా కార్టక్రమాలపై చర్చ జరిపారు. రైతు, వ్యవసాయ సమస్యలపై నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న టీడీపీ నేతలు… విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖాపై ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతోందన్న చంద్రబాబు… ఏపీలోని డ్రగ్స్ మాఫియాపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. నకిలీ మద్యం తయారీ.. మద్యం అక్రమాలపై ఫోకస్ పెట్టనున్నారు టీడీపీ నేతలు.