ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తుంది. అయితే ఎమ్మెల్యే అమర్నాథ్ ఛాలెంజ్ కు కౌంటర్ ఇచ్చారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు తెలుగు దేశం పార్టీకి మాత్రమే ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై చర్చించడానికి, సవాల్ చేయడానికి టీడీపీ సిద్దం అన్నారు. విశాఖపట్నం పునర్నిర్మాణం జరిగింది అంటే అది చంద్రబాబు చొరవతోనే. కానీ తెలుగు దేశం పార్టీ వద్ద రాజకీయాలలో ఓనమాలు నేర్చుకున్న అమర్నాథ్ ఉత్తరాంధ్ర నాయకులకు సవాల్ విసురుతారా… మీ వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ అయినా ఉత్తరాంధ్ర కు తెచ్చారా అని ప్రశ్నించారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తాకట్టు పెట్టి అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా… చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన వాటికి మీ పేర్లు పెట్టుకుని ఇదే మేము చేసిన అభివృద్ధి అంటారా… ఉత్తరాంధ్ర లో ఉన్న నిరుద్యోగులకు సమాధానం చెప్పే దమ్ము నీకు గాని , నీ పార్టీ నాయకులకు గాని ఉందా అని అడిగారు.