కాళేశ్వరం కుంగినట్లే.. కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుంది
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగం అధికంగా ఉందని బిస్వాల్ కమిటీ నివేదక వెల్లడించిందన్నారు. కాళేశ్వరం కుంగినట్లే…కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతోందని ఆయన అన్నారు. సాధించి తెచ్చుకున్న తెలంగాణాను మాటల గారడితో ప్రజలను మోసం చేస్తుండని కోదండరాం విమర్శించారు. కమిషన్ల కక్కుర్తితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైన్ చేశారని, 6). మూడేళ్ళు పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోవడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమన్నారు కోదండరాం.
మానవీయ కోణంలో ఆలోచించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం
నిజామాబాద్ రూరల్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బాగుంటే దేశం బాగుంటది అది ప్రణాళిక బద్దంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లో నీటి పన్నులు వాసులు చేస్తే తెలంగాణ లో నీటి పన్ను రద్దు చేశామని, నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. రైతు బంధును పుట్టించింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు బంధు, 24 కరెంట్ దుబారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ధరణి నీ బంగళాఖాతంలో వేస్తారట, ధరణి పోర్టల్ ఉన్నది కాబట్టే రైతుల భూములు సేఫ్ గా ఉన్నాయన్నారు. భూమి యాజమాన్య హక్కును మార్చే హక్కు ముఖ్యమంత్రి కి లేదని ఆయన అన్నారు.
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు.. తీర్పు రిజర్వ్
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
“ఎన్నికలకు ముందు కావాలనే అక్రమ కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. బెయిల్‌పిటిషన్‌పై విచారణ చేసినప్పుడు.. కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరిపి సాధించింది ఏంటి?. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు? సీఐడీ డీఐజీ, ఏఏజీలు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది అడ్వకేట్స్ ఎథిక్స్‌కు విరుద్ధం. పోలీస్ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరించకూడదు.” అని లూథ్రా వాదనలు వినిపించారు.
ధరణి వద్దు అన్న కాంగ్రెస్‌ని బంగాళాఖాతంలో కలిపేయాలి
ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించి బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధరణి వద్దు అన్న కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. మూడు గంటల కరెంట్ చాలు అన్న వాళ్ళని పొలిమెరలు దాటించాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. 10 hp మోటార్ అని రేవంత్ రెడ్డి చెబుతాడు ఎక్కడైనా ఆ మోటార్ ఉంటుందా అని మంత్రి హరీష్ రావు అన్నారు.
ప్రతిపక్షాలు విమర్శించదానికీ ఎం లేక బూతులు మాట్లాడుతున్నాయని, మనకి బూతులు కావాలా..భవిష్యత్ అందించే నాయకులు కావాలా అని ఆయన అన్నారు. రైతుల్ని బిచ్చగాళ్లు అని రేవంత్ రెడ్డి హేళన చేస్తున్నారని, రుణమాఫీ కోసం ఎన్నికల కమిషన్ లేఖ రాశామన్నారు. ఒకవేళ అనుమతిస్తే వారం లోపు మొత్తం రుణమాఫీ చేస్తామని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మోసం తెలియాలంటే కర్నాటక వెళ్లి చూసొచ్చి ఓటేయాలని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే… వచ్చే జనవరి నుంచే అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగిస్తామన్నారు. దీంతో అవి పట్టా భూములుగా మారతాయని హరీష్ రావు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిలిపివేశారన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే రుణమాఫీ డబ్బులు అకౌంట్లలో వేస్తామని.. లేదంటే డిసెంబర్ 3 తర్వాత జమ చేస్తామన్నారు.
తీవ్రమవుతున్న యుద్ధం.. గాజాలోని 4 పట్టణాలను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఆదేశాలు..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా స్ట్రిప్‌పై భూతల దాడి చేస్తున్న ఇజ్రాయిల్ బలగాలు హమాస్ వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు గాజాను అదుపులోకి తీసుకునేందుకు ఆపరేషన్స్ చేపడుతోంది. ముఖ్యంగా గాజాలోని ఉత్తర ప్రాంతంపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే హమాస్ పార్లమెంట్‌తో పాటు హమాస్ నియంత్రణలో ఉన్న ఓడరేవును ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది.
ఇదిలా ఉంటే గురువారం రోజున ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ లోని 4 పట్టణాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఆదేశించింది. ఈ ఆదేశాలతో గాజాలోని సురక్షిత ప్రాంతాలకు కూడా యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తోంది. హమాస్ కమాండ్ సెంటర్‌గా ఉందని అనుమానిస్తున్న గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా ఆస్పత్రిని ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది.
రైతు బంధు వస్తుందని కలలో కూడా అనుకోలేదు
మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నేడు బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళ పాలన ఎలా ఉందో మీకు తెలుసునన్నారు. తెలంగాణలో రైతుల గురించి అద్భుతంగా పని చేశామని, రైతు బంధు వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు సీఎం కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకు సహాయం చేయలేదని, రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వమే కొంటుందన్నారు సీఎం కేసీఆర్. ప్రజలు కట్టే పన్నుల డబ్బులని కేసీఆర్ వృథా చేసి రైతు బంధు ఇస్తున్నారని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, రైతు బంధు వృథానా..? అని ఆయన ప్రశ్నించారు.
పుతిన్‌ని విమర్శించిన సీనియర్ సైనిక అధికారి మృతి..
రష్యా అధినేత పుతిన్‌ని విమర్శించిన సీనియర్ మిలిటరీ జనరల్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. లెఫ్టినెంట్ జనరల్ స్విరిడోవ్, స్టావ్‌రోపోల్ ప్రాంతంలోని అతని ఇంటిలో చనిపోయినట్లు రష్యన్ మీడియా తెలియజేసింది. 6వ వైమానికదళం, ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ స్విరిడోవ్ మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఇతని శవం పక్కనే ఒక మహిళ శవం పడిఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఎవరనేదానిని ఇంకా గుర్తించలేదు. ఇతర మీడియా నివేదికల ప్రకారం ఆమె అతని భార్య అని చెబుతున్నారు. అయితే చనిపోయే ముందు ఎలాంటి పెనుగులాట, హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని, ఎలా చనిపోయారనే దానిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గదిలో ఎలాంటి విషపూరిత పదార్థాల ఆనవాళ్లు దొరలేదని రష్యా అధికారులు తెలిపినట్లు మీడియా నివేదించింది.
సలార్ నైజాం హక్కులు.. రూ. 90 కోట్లు.. ఎవరు దక్కించుకున్నారంటే.. ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్.. ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. డిసెంబర్ 1 న ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పాటు.. రెండు రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అధికారికంగా వెల్లడిస్తున్నారు.
చంద్రబాబు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడు..
చంద్రబాబు మోసగాడు, నిజం మాట్లాడని వ్యక్తి రైతును మోసం చేశాడు 87 వేల కోట్ల రుణాలు రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సామాజిక సాధికార సభలో మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రసంగించారు.
చంద్రబాబు ఒక అబద్ధమని.. సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు వైఖరితో తీవ్ర మనోవేదనకు గురైన ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలను సీఎం జగన్ ఆదుకున్నారన్నారు. జగన్ అంటే నిజం.. చంద్రబాబు అంటే అబద్ధం అని జనాలకు తెలుసన్నారు. పేదరికమనే రక్కసిని ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీల దరికి చేరకుండా కాపాడిన వ్యక్తి సీఎం జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు. రేపటి వైఎస్ఆర్సీపీ గెలుపు ఒక ఎస్సీ గెలుపు, బీసీ గెలుపు, ఎస్టీ గెలుపు, మైనారిటీ గెలుపు కూడా అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
నాకు 8 వందల ఎకరాల భూమి ఉంది
తెలంగాణలో ఎన్నికల ప్రచారం పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీవీ నిర్వహిస్తోన్న క్వశ్చన్ అవర్‌లో నేడు మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి జర్నలిస్తులు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా.. ‘ నా దగ్గర పర్‌ఫెక్ట్ పాన్లింగ్, హార్డ్‌వర్క్, డిసిప్లెన్ ఉంది. అప్పుడు టీడీపీలో గెలిచిన వాళ్లంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీలో ఎంపీగా గెలిచాక నేను ఒక్కడినే ఏకాకి అయ్యా. అందుకే నేను కూడా టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరా. నేను కబ్జా చేయలేదు, నాకు 8 వందల ఎకరాల భూమి ఉంది. నేను రాజకీయాల్లోకి రాకముందే ఆస్తులు, భూములున్నాయి. ధరణిలో తప్పులుంటే సరిదిద్దుతున్నాం. సూరారంలో నాకు 56 ఎకరాలు ఉంది, చెరువును భూకబ్జా చేయలేదు. మైసమ్మగూడలో మునిగిపోయిన భవనాలు నావి కావు. నేను ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదు. నా దగ్గర ఉన్న ప్రతి గజం భూమికి రికార్డు ఉంది. ఐదారు ఎకరాలకు తప్పితే.. నేను రైతు బంధు తీసుకోను. రైతుబంధు నా అకౌంట్లో ఎంత పడుతుందో కూడా నాకు తెలియదు. రేవంత్ రెడ్డి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. రేవంత్ రెడ్డి ఇంత గొప్పోడు ఎలా అయ్యాడు. నన్ను రేవంత్ రెడ్డి ఎంతో ఇబ్బంది పెట్టాడు.’ అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
కులగణన కోసం శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం..
ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని.. అది తప్పు అని చెప్పడానికే ఈ సభ ఉద్దేశమని విజయనగరం జిల్లా రాజాంలో సామాజిక సాధికారిక యాత్రలో స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక, సాధికారిక జైత్రయాత్ర ఇది అంటూ ఆయన పేర్కొన్నారు. జోగులు అందరివాడు.. సామాన్య జనంతో కలిసిపోయే మనసత్వం ఉన్న వ్యక్తి అని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. జగన్ పిలుపు ఇస్తే ఈ రోజు రాజాంలో జనప్రవాహం కదిలి వచ్చిందన్నారు. తాండ్రపాపారాయుడు పుట్టిన గడ్డ ఇది… అన్యాయాలను, అవినీతిని సహించం… తిరగబడతామన్నారు. రాజ్యాంగబద్దంగా అందరికీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చాం… ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమే ఇది అని ఆయన వెల్లడించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి 700 మంది డైరెక్టర్లను నియమించిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. కులగణన జరగాలని దేశంలో మొట్టమొదటిసారిగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కులగణన కోసం శ్రీకాకుళం జిల్లా నుండే శ్రీకారం చుట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారన్నారు. అభివృద్ది అంటే పేదలు సంతృప్తిగా జీవించడం, విద్య, వైద్యం ఉచితంగా అందించడమే అభివృద్ది… అదే జగన్ చేశారన్నారు. నాడు నేడు పేరుతో కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్మించాం… ఇది అభివృద్ది కాదా అంటూ ప్రశ్నించారు.