శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస నియొజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. నాడు టీడీపీ అధినేత చంద్రబాబు వెనుకబడిన వర్గాలను అవహేలన చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనగారిన వర్గాల ప్రజలను అణగద్రొక్కే పరిస్థితులలో జగన్ అధికారంలోకి వచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారు అని స్పీకర్ గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాలు నేడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వెళ్లేందుకు కృతనిచ్చయంతో ఉన్నారు అని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.
Read Also: Rat Glue Pad: ఎలుకలు పట్టే రాట్ ప్యాడ్స్ నిషేధం.. కారణం ఏంటో తెలుసా?
నేడు వెనుకబడిన వర్గాల వారికి ఆత్మగౌరవం పరిరక్షించే అవకాశం వచ్చింది అని స్పీకర్ తమ్మినేని సీతారం తెలిపారు. మళ్లీ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకొవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలకు ప్రజలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు అని చెప్పుకొచ్చారు. భారత దేశానికే రోల్ మోడల్ గా జగన్ పాలన ఉంది.. జగన్ ను చేజార్చుకుంటే బ్రతుకు భరోసా ఉండదని ప్రజలు గ్రహించారు.. రేపు జరగనున్న ఎన్నికలలో జగన్ సీఎంగా మరో సారి ఎన్నిక కావడం పక్కా అంటూ స్పీకర్ తమ్మినేని సీతారం వెల్లడించారు.
Read Also: Bus Accident: విజయవాడ బస్సు యాక్సిడెంట్ పై నివేదిక
ఇక, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. అనగారిన కులాలకు గుర్తింపు సీఎం జగన్ ఇచ్చారు.. క్యాబినెట్ లో 5 ఉపముఖ్యమంత్రులను చేసారు.. బీసీలంటే వెనుకబడిన కులం కాదంటూ అన్నింటా న్యాయం చేసారు.. గత ప్రభుత్వం కేంద్ర మంత్రులుగా అవకాశం వస్తే అశోక్ గజపతి రాజు, సృజనా చౌదరిలను నియమించారు.. నేడు అన్ని రంగాలలో జగన్ సామాజిక న్యాయం అందిస్తున్నారు అని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.