Yellow Crazy Ants: చీమే కదా అని తక్కువ అంచనా వేయకండి. సైజులో చిన్నగా ఉన్నా చీమ కుడితే ఎంతటి ప్రాణి అయినా గిలగిల కొట్టుకోవాల్సిందే. చీమలు లక్షల సంఖ్యలో దండయాత్ర చేస్తే ప్రజలు వణికిపోవాల్సిందే. తమిళనాడులోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి గ్రామాలపై చీమలు దండెత్తాయి. గ్రామాల్లోకి చొచ్చుకొస్తున్న చీమల దండు కనిపించిన ప్రతి వస్తువును తినేస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.…
తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రిటైర్ జడ్జి జస్టిస్ ఆరుముగసామి ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్.. జయలలిత నెచ్చెలి సహా మరికొందరిని విచారించేందుకు న్యాయనిపుణులతో చర్చించాలని నిర్ణయించింది.
తమిళనాడులోని కొట్టాయం మీనాచిల్ వద్ద ఆగి ఉన్న ఆటోను కారు వేగంగా ఢీకొంది. అదృష్టవశాత్తు వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ సురక్షితంగా బయటపడింది.
ఓ మందుబాబు చేసిన తుంటరి పనికి దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆగింది. ఆగిపోవడమే కాకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఇంతకీ అతను చేసిన పని ఏంటంటే.. శనివారం నాడు తన కుటుంబ సభ్యులను దేశం నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్న ఓ తాగుబోతు.. దుబాయ్‌కి వెళ్లే ఓ ప్రైవేట్ క్యారియర్‌కు బూటకపు బాంబు బెదిరింపు చేసి పోలీసుల వలలో పడ్డాడు.
Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా త్రిష పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపుగా అందరూ అగ్రహీరోల సరసన నటించింది. చిరంజీవితో స్టాలిన్, బాలయ్యతో లయన్, నాగార్జునతో కింగ్, వెంకటేష్‌తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, ప్రభాస్‌తో వర్షం, పౌర్ణమి.. మహేష్‌తో అతడు, ఎన్టీఆర్‌తో దమ్ము లాంటి సినిమాలు చేసింది. ఇప్పటికీ అవకాశం వస్తే లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తోంది. తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి…
తమిళనాడులోని చెన్నెలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.20 కోట్ల విలువైన బంగారం, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. చెన్నై నగరంలోని అరుంబాక్కంలోని ఫెడ్‌గోల్డ్ బ్యాంకులో చొరబడ్డ దొంగలు అత్యంత చాకచక్యంగా బంగారంతో పాటు నగదును దోచుకెళ్లారు.
Ajith Kumar: కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ కుమార్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తనలోని పవర్‌ను అభిమానులకు చాటి చెప్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో షూట్ చేసే వ్యక్తిగా అభిమానులు అజిత్‌ను చూసి ఉంటారు. అయితే ఇప్పుడు రియల్ లైఫ్‌లో షూటింగ్‌లో అజిత్ ఇరగదీస్తున్నాడు. ప్రస్తుతం 47వ తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో అజిత్‌తో పాటు…
తమిళనాడు బాలికల ఆత్మహత్యలు ఆవేదన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కడలూర్ జిల్లాలో మంగళవారం 12వ తరగతి చదువుతున్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో రెండు వారాల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Man Donation With Begging: మనుషులు చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సంపాదించింది ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతారు. ఇతరులకు పైసా కూడా ఇవ్వరు. పిసినారిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు మాత్రం తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ తెగ ఖర్చు చేస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం తన దగ్గర డబ్బులు లేకపోయినా భిక్షాటన చేసి ఓ ప్రభుత్వ పాఠశాల కోసం విరాళం ఇచ్చాడు. ఆ విరాళం వందల్లోనో, వేలల్లోనో కాదు.. ఏకంగా…
తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఇదే రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు రేకిత్తించిన కల్లకురిచ్చిలో విద్యార్థి మృతి ఘటన మరవకముందే ఇది చోటుచేసుకుంది. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో కలకలం రేపుతోంది.