Robbery in Bank: తమిళనాడులోని చెన్నెలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.20 కోట్ల విలువైన బంగారం, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. చెన్నై నగరంలోని అరుంబాక్కంలోని ఫెడ్‌గోల్డ్ బ్యాంకులో చొరబడ్డ దొంగలు అత్యంత చాకచక్యంగా బంగారంతో పాటు నగదును దోచుకెళ్లారు. బ్యాంకులోకి వినియోగదారుల మాదిరిగా ప్రవేశించిన ముగ్గురు దొంగలు.. బ్యాంకులోని సిబ్బందికి మత్తుమందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు.
Naina Jaiswal: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిని వేధించిన పోకిరి అరెస్ట్
దొంగలు ఇచ్చిన మత్తుమందు కారణంగా బ్యాంకులోని సిబ్బంది స్పృహ కోల్పోగా.. బంగారం, నగదును బ్యాంకు నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బ్యాంకు అధికారులు జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నేరుగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.