Rahul Gandhi reunites with ‘Village Cooking Channel": విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్" దీని గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ప్రారంభం అయిన ఈ యూట్యూబ్ ఛానెల్ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. కొంతమంది సభ్యులు అవుట్ డోర్ లొకేషన్లలో చేరే వంటకాలతో చాలా ఫేమస్ అయింది. 2018లో ప్రారంభం అయిన ఈ ఛానెల్ కు ఏకంగా 1.8 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గతంలో ఓ సారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మూడో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం కాగా.. స్కాట్ క్రిస్టియన్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Heavy rain forecast for southern states: భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తనున్నాయి. రానున్న రోజుల్లో అన్ని సౌత్ స్టేట్స్ లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నాలుగు రోజుల పాటు తీవ్రమైన వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో ఒడిశా, మహారాష్ట్రల్లో భారీ వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇదే సమయంలో వాయువ్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Diesel Shortage in chennai city: చెన్నై నగరంలో డిజిల్ కొరత ఏర్పడింది. నిర్వాహక లోపాల కారణంగానే కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిజిల్ నింపుకోవడానికి వచ్చే వాహనాలతో బంకుల మందు భారీ క్యూ ఏర్పడింది. క్రూడాయిల్ కొరత, పంపిణీ సమస్యల కారణంగా డిజిల్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి డిజిల్ కొరత రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఒక్క చెన్నైలోనే కాకుండా తమిళనాడులోని పలు నగరాల్లో…
Rahul Gandhi's Bharat Jodo Yatra launch today: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నేడు ప్రారంభం కాబోతోంది. కన్యాకుమారిలో బుధవారం యాత్ర ప్రారంభం కాబోతోంది. అంతకుముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబుదూర్ లోని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించనున్నారు. మొత్తం 3,570 కిలోమీటర్లు, 150 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా పాదయాత్ర…
తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 5 విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
Tamilnadu Crime Scene: తమిళనాడులోని ఈరోడ్‌లో దారుణం చోటుచేసుకుంది. కూతురిపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి కన్న కూతురు పిండాన్ని కన్నతల్లి అమ్ముకుంటున్న ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలిక నుంచి లెక్కకు మించిన సార్లు పిండం విక్రయించిన ముఠాను అరెస్ట్ చేయగా తల్లి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తల్లి, పెంపుడు తండ్రి సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోడ్‌లోని రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు.…
తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమించుకోవడమే కాకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులే బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహాన్ని ఘనంగా జరిపించడం గమనార్హం.