Tamilnadu: మరో విద్యార్థిని ఆత్మహత్య.. పక్షం రోజుల వ్యవధిలో రెండో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఇదే రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు రేకిత్తించిన కల్లకురిచ్చిలో విద్యార్థి మృతి ఘటన మరవకముందే ఇది చోటుచేసుకుంది. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో కలకలం రేపుతోంది. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం ఉదయం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలోని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. తిరుత్తణికి చెందిన 17 ఏళ్ల బాలిక తిరువళ్లూరు జిల్లా కిలాచేరి గ్రామంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న తన స్నేహితులకు బాలిక ఆలస్యంగా వస్తానని చెప్పింది. అయితే, మొదటి గంట గడిచే వరకు ఆమె తిరిగి రాకపోవడంతో, పాఠశాల సిబ్బంది ఆమె హాస్టల్ గదిని తనిఖీ చేయగా, ఆమె పైకప్పుకు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం హాస్టల్ నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. నెల రోజులుగా బాలిక ఇంటికి వెళ్లలేదని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మనోవేదనతో ఉన్నట్లు ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపారు. సీబీసీఐడీ అధికారులు, తిరువళ్లూరు జిల్లా డీఎస్పీ సెల్వకుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల క్యాంపస్‌లోని పాఠశాల సిబ్బంది, హాస్టల్ వార్డెన్‌లను సీబీసీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం హాస్టల్‌లో ఉంటున్న ఇతర విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించి వారి ఇళ్లకు పంపించింది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
మరోవైపు బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుత్తణి వద్ద రోడ్లను దిగ్బంధించి నిరసనకు దిగారు. ఈ ఆత్మహత్య ఘటనపై తమకు అనుమానంగా ఉందని బాలిక తల్లిదండ్రులు అన్నారు. తమ కూతురికి అసలేం జరిగిందో తెలియకుండా ఆమె మృతదేహాన్ని తీసుకోమన్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వెల్లడించారు. గత రాత్రి కూడా తమతో మాట్లాడిందని తల్లిదండ్రులు చెప్పారు. మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసి.. అనంతరం ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యా సంస్థలో ఏదైనా మరణం సంభవించినట్లయితే సీబీ-సీఐడీ ద్వారా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది.
Apple Watch Saves Woman Life: యువతి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
రాష్ట్రంలోని కళ్లకురిచ్చిలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుల చిత్రహింసలకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్లకురుచ్చిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్థిని మృతి చెందడంతో జిల్లాలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకోవడంతో సేలం పోలీసులు పాఠశాల, ఇతర ప్రాంతాల చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. హింసను ప్రేరేపించింది ఎవరో తేల్చాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అధ్యాపకుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక అంత్యక్రియలను తమిళనాడులోని కళ్లకురిచ్చి వేప్పూర్‌లో శనివారం నిర్వహించారు.
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?