TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి.. డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ!
- తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు
- డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ
- తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ ప్రకటించారు. ఈరోజు చెన్నైలో జరిగిన సభలో మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుందని విజయం స్పష్టం చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. అయితే డీఎంకే, ఏఐడీఎంకే కంచుకోటల నుంచే విజయ్ పోటీ చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
పెరంబూర్ నియోజకవర్గం సామాజిక సమీకరణ పరంగా కీలకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఎస్సీ ఓటర్లు సుమారు 20 నుంచి 25 శాతం ఉండగా.. క్రిస్టియన్లు 8 నుంచి 12 శాతం, ముస్లింలు 10 నుంచి 15 శాతం వరకు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి స్థిరపడిన తెలుగు ఓటర్లు 20 నుంచి 25 శాతం వరకు ఉండటం విశేషం. పెరంబూర్ నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. డీఎంకే నాలుగు సార్లు, ఏఐడీఎంకే రెండు సార్లు విజయం సాధించాయి. దీంతో పెరంబూర్ డీఎంకేకు కంచుకోటగా భావిస్తారు. ఇలాంటి కీలక నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read
- Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
- UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
ఇక తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ బీసీ ఓటర్లు సుమారు 40 శాతం వరకు ఉన్నారు. ఎస్సీ వర్గం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. తెలుగు ఓటర్లు 12 నుంచి 16 శాతం వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గత ఆరు ఎన్నికలలో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు మూడేసి సార్లు విజయం సాధించాయి. దీంతో ఇక్కడ పోటీ సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. డీఎంకే, ఏఐడీఎంకేలకు మంచి పట్టు ఉన్న పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగుతుండడం అందరిలో ఆసక్తి నెలకొంది. రెండు కీలక నియోజకవర్గాలను ఎంచుకోవడం ద్వారా తన ప్రభావాన్ని చాటుకోవాలని విజయ్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?