Vijay: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళ సమస్యల్ని లెవనెత్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) దివంగత చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన, ప్రభాకరన్‌పై ప్రశంసించడం సంచలనంగా మారింది. దేశ ప్రజలు శ్రీలంక తమిళుల గొంతుక కావాలని పిలుపునిచ్చారు.
Vijay: తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ శనివారం తన రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి తన తొలి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో డీఎంకేలు రెండూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వారు ఇచ్చిన హామీలు విఫలమయ్యాయని అన్నారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు దేవాలయాల్లో ప్రార్థనలు చేసినట్లుగా, 2026 ప్రజాస్వామ్య యుద్ధానికి సిద్ధమయ్యే ముందు ప్రజలను కలవడానికి వచ్చానని…
వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో తమిళ పాలిటిక్స్‌లో నెచ్చెలి శశికళ యాక్టివ్ అయ్యారు. చిన్నమ్మ సరికొత్త రాజకీయ ఆట షురూ చేశారు.
TVK Chief Vijay : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎమోషనల్ అయ్యాడు. స్టేజి మీదే అందరి ముందు ఏడ్చేశాడు. విజయ్ పెట్టిన పార్టీ టీవీకే. పార్టీని అనౌన్స్ చేసే కార్యక్రమం తర్వాత మళ్లీ ఇన్ని రోజులకు నేడు మధురలో మానాడు కార్యక్రమం నిర్వహించారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో తనకోసం వచ్చిన లక్షల మందిని చూసి విజయ్ ఉప్పొంగిపోయారు. ఆయన…
NDA vs INDIA bloc: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు కానున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈక్రమంలో సోమవారం ఎన్డీఏ కూటమి తరుఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఉంటుందా, ఉండదా అనే సందేహాలకు చెక్ పెడుతూ మంగళవారం ఇండియా అలయన్స్ తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఇద్దరు బలమైన ప్రొఫైల్ కలిగిన అభ్యర్థుల…
MK Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం విద్యార్థులతో ముచ్చటించారు. విభజన సిద్ధాంతాలను స్వీకరించవద్దని వారిని హెచ్చరించారు. నాథూరామ్ గాడ్సే మార్గాన్ని తిరస్కరించాలని సూచించారు. ‘‘గాంధీ, అంబేద్కర్ మరియు పెరియార్ తీసుకున్న మార్గాలతో సహా మనకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడూ గాడ్సే గ్రూపు మార్గాన్ని తీసుకోకూడదు’’ అని ఆయన తిరుచ్చిలోని జమాల్ మొహమ్మద్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో పాటు పార్టీల మధ్య పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) ఎంట్రీతో తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీతో చేతులు కలపడానికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) శనివారం చెప్పారు. బీజేపీతో తన పొత్తలో అన్నాడీఎంకే పెద్దన్న అని చెప్పారు.
Tamil Nadu: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి అధికార డీఎంకే, అన్నాడీఎంకే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) మధ్య ముక్కోణపు పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వాదనలు తమిళనాట జోరుగా వినిపిస్తున్నాయి.
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కదంబూర్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో రాజకీయ నాయకుడు విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరవచ్చని బాంబ్ పేల్చారు. విజయ్ ఎన్డీఏ కూటమీలో వస్తారేమో అంటూ తెలిపారు. జనవరి తర్వాత పొత్తులపై స్పష్టత వస్తుందని అన్నారు. డిఎంకేను ఓడించడమే ఏఐఏడీఎంకే, విజయ్ ల లక్ష్యమని అన్నారు. ఇదే ఆలోచనతో విజయ్ సైతం ఉన్నారు. Also Read:Atti…