PMK Chief Anbumani: నా స్నేహితుడు మోపిదేవి వెంకటరమణ కుమారుడు పెళ్లి కోసం వచ్చాను అని పట్టాలి మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.5 శాతం వన్నీయర్ అగ్నికుల క్షత్రియ కులస్తులు ఉన్నారు.. వన్నీయర్ కులం నుంచి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని నా స్నేహితుడు మంత్రి నారా లోకేష్ ను కోరాను.. అగ్నికుల వన్నీయర్ లో కులానికి ప్రత్యేక కేటగిరి ఇవ్వాలని కోరుతున్నాం.. కుల గణన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నాను.. గత ముఖ్యమంత్రి 80 శాతం పూర్తి చేశాడు.. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుంది అన్నారు. కాగా, మిగతా రాష్ట్రాల్లో కుల గణన ఇప్పటికే పూర్తి చేశారు.. కులాల వారీగా కుల గణన జరగాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీ సీఎంను కలుస్తానని పట్టాలి మక్కల్ కట్చి చీఫ్ అన్బుమణి పేర్కొన్నారు.
Read Also: BSNL: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్.. డైలీ 2.5GB డేటా.. తక్కువ ధరకే
అలాగే, తమిళనాడులో కుల గణన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని పట్టాలి మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ చెప్పుకొచ్చారు. విద్య, ఉద్యోగ అవకాశం కోసమే పోరాటం చేస్తున్నాం.. కుల గణన చేయడంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫెయిల్ అయ్యాడు అని విమర్శించారు. దేశంలోని ఏడు రాష్ట్రాలు కుల గణన పూర్తి చేశాయి.. రాబోయే రోజుల్లో PMK పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తామని తెలిపారు. ఎంతోమంది ప్రజలు PMK పార్టీ రావాలని కోరుకుంటున్నారు.. సమాజానికి న్యాయం సిద్ధాంతంతో పీఎంకే పార్టీ నడుస్తుంది అన్నారు. ఇక, టీవీకే పార్టీ ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్నారు.. ఆ పార్టీ సిద్ధాంతాలు ఇంకా స్పష్టంగా ప్రజలకు చెప్పలేదన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దామని అన్బుమణి రామదాస్ వెల్లడించారు.