Pakiatan: దాయాది పాకిస్తాన్‌ని ఓ వైపు బలూచిస్తాన్ లో బలూచ్ లిజరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ) దెబ్బ కొడుతున్న పట్టడం లేదు. భారత్‌ని కవ్విస్తూ యుద్ధోన్మాదంతో ప్రవర్తిస్తోంది. ఇప్పటికే, బీఎల్ఏ పాక్ సైనికుల్ని ఊచకోత కోస్తున్నారు. బలూచిస్తాన్‌లో ఉరికించి కొడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా పాక్ తాలిబాన్లు 30 మంది పాక్ సైనికులను చంపినట్లు శుక్రవారం రాత్రి పేర్కొంది.
Read Also: Pak Drone Attack: పౌర విమానాలను రక్షణగా వాడుకుంటూ పాకిస్తాన్ డ్రోన్ దాడులు..
మార్చి నుంచి పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ‘‘ఆపరేషన్ అల్ ఖండక్’’ నిర్వహిస్తున్న తాలిబాన్లు, నిన్న రాత్రి దక్షిణ వజీరిస్తాన్‌లోని షేకై జిల్లాలోని డాన్ గేట్ సైనికపోస్టుపై తీవ్రమైన దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పాక్ ఆర్మీ వ్యక్తుల్ని లేజర్ గన్‌లో చంపామని టీటీపీ ప్రతినిధి ముహమ్మద్ ఖొరాసాని శుక్రవారం వెల్లడించారు. ఈ దాడి విషయం తెలుకున్న ఒక సైనిక కాన్వాయ్ మాంటోక్ ప్రాంతం నుంచి వచ్చిన సమయంలో దానిపై కూడా దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 20 మంది సిబ్బంది మరణించారని, ఐదుగురు గాయపడినట్లు వెల్లడించారు.
ఉత్తర వజీరిస్తాన్ మిరాలి జిల్లాలోని ఖుష్హాలి నటాసి ప్రాంతంలో శుక్రవారం మరో సైనిక కాన్వాయ్‌పై పాక్ తాలిబాన్లు దాడి చేశారు. ఈ దాడిలో 08 మంది సైనిక సిబ్బంది మరణించగా, నలుగురు గాయపడ్డారని తాలిబాన్లు తెలిపారు. ఇదే ప్రాంతంలోని మీర్ అలీ జిల్లాలో హనీమూన్ హోటల్ సమీపంలోని సైనిక పోస్టుపై దాడి చేసి ఇద్దరు పాక్ సైనికుల్ని హతమార్చినట్లు టీటీపీ తెలిపింది.
https://twitter.com/TheLegateIN/status/1920864561470595314