Jaishankar: ప్రాంతీయ రాజకీయాల్లో సరికొత్త మలుపు తిసుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తొలిసారిగా ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ కార్యకలాప విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో ఫోన్ ద్వారా అధికారికంగా మాట్లాడారు. ఇది భారత్ తరఫున తాలిబాన్ ప్రభుత్వంతో మంత్రివర్గ స్థాయిలో జరిగిన తొలిసారిగా జరిగిన సమావేశంగా చరిత్రలో స్థానం సంపాదించింది.
Read Also: IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఆరుగురు మ్యాచ్ విన్నర్స్ తిరిగొచ్చేశారు!
ఈ కాల్ లో, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆ దాడిలో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హత్య చేసిన సంగంతి తెలిసిందే. ఇక డాక్టర్ జైశంకర్ ట్విటర్ వేదికగా ముత్తాకీతో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ.. “పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన ఖండించినందుకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. అలాగే భారతదేశం తరపున ఆఫ్గాన్ ప్రజలతో ఉన్న సాంప్రదాయ మైత్రీని గుర్తు చేస్తూ, వారి అభివృద్ధి అవసరాలకు మద్దతుగా నిలబడతామని చెప్పారు.
Read Also: IPL 2025: ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం.. మయాంక్‌కు మళ్లీ గాయం!
Good conversation with Acting Afghan Foreign Minister Mawlawi Amir Khan Muttaqi this evening.
Deeply appreciate his condemnation of the Pahalgam terrorist attack.
Welcomed his firm rejection of recent attempts to create distrust between India and Afghanistan through false and…
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 15, 2025
ఇక పాకిస్థాన్ మీడియా తాలిబాన్‌ను కాశ్మీర్ ఉగ్రదాడులతో అనుసంధానిస్తూ ప్రచారం జరుపుతుండగా, ముత్తాకీ దీనిని ఖండించారని జైశంకర్ తెలిపారు. భారత్–ఆఫ్గాన్ సంబంధాలపై అసత్య ప్రచారాలను తాలిబాన్ తిరస్కరించడం భారత అధికార వర్గాల వద్ద సానుకూలంగా మద్దతుగా నిలిచింది. ఇక పాకిస్థాన్‌తో భారతదేశం అన్ని వాణిజ్య సంబంధాలను తాత్కాలికంగా నిలిపిన నేపథ్యలో, ఆఫ్గాన్ కు భారత్‌తో వాణిజ్యం కొనసాగించేందుకు చబహార్ పోర్ట్ ముఖ్య మార్గంగా మారుతోంది. భారత్–ఆఫ్గాన్ భూసంధి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కారణంగా మూసుకుపోయినందున, చబహార్ పోర్ట్ ద్వారానే సరుకు రవాణా సాధ్యం అవుతుంది.
د ا.ا.ا. د بهرنیو چارو وزیر محترم مولوي امیر خان متقي او د هند جمهوریت د بهرنیو چارو وزیر ښاغلي جې شنکر ټيلیفوني خبرې وکړې.
په دې مکالمه کې د دوو اړخیزو اړیکو پر پیاوړتیا، تجارت او د دیپلوماتیکو اړیکو د کچې پر لوړولو خبرې وشوې. pic.twitter.com/weErRrvARu— Hafiz Zia Ahmad (@HafizZiaAhmad) May 15, 2025
2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ కొన్ని పరస్పర సహకార చర్యలు ప్రారంభించింది. 2024లో ఏప్రిల్ 27న భారత సీనియర్ రాయబారి ఆనంద్ ప్రకాశ్, కాబూల్ వెళ్లి ముత్తాకీని కలిశారు. గత సంవత్సరం జేపీ సింగ్ కూడా రెండు సార్లు ఆఫ్గాన్ వెళ్లారు. జనవరిలో దుబాయ్‌లో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి తాలిబాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సహాయ కార్యక్రమాలు, వాణిజ్యం, ప్రాంతీయ భద్రత అంశాలు చర్చకు వచ్చాయి.