Pakistan Afghanistan war: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం మొదలైనట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే దాయాదిదేశం పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా ఆఫ్ఘన్ స్పందించింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థన్, పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ 9న పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, పాక్టికాలో TTP చీఫ్ నూర్ వలీ మెహ్సుద్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. తాజాగా పాకిస్థాన్ వైమానిక దాడులకుఆఫ్ఘనిస్థన్…
Taslima Nasreen: 2021లో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత, తాలిబాన్ ప్రతినిధి బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేకపోవడంపై చర్చ నడిచింది. తాలిబాన్లు మహిళల్ని దూరంగా పెడుతున్నారనే వాదన వినిపించింది.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశంలో చైనా, తాలిబన్ల మధ్య కీలక ఒప్పందం జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి తాలిబన్ చైనా, పాకిస్తాన్‌తో అంగీకరించింది. ఆంక్షలతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి బిలియన్ల డాలర్లు సమకూరే అవకాశం ఉంది.
100 children killed in suicide bombing at Kabul school: ఆప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. రాజధాని కాబూల్ లోని ఓ స్కూల్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 100కు చేరినట్లు తెలుస్తోంది. కాబూల్ నగరానికి పశ్చిమాన ఉన్న దష్ట్-ఏ- బర్చి ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి సమయంలో మొత్తం స్కూల్ లో దాదాపుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సిద్ధం…
Afghanistan comments on Masood Azhar and pakistan: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. జైషే చీఫ్ మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్ లోని నంగర్ హార్ ప్రావిన్స్ ప్రాంతంలో ఎక్కడో ఓ చోట తలదాచుకున్నాడని.. అతన్ని పాకిస్తాన్ కు అప్పగించాలని కోరుతూ.. పాకిస్తాన్ విదేశాంగా శాఖ ఆఫ్ఘనిస్తాన్‌కు లేఖ రాసింది. అతన్ని పట్టుకుని పాకిస్తాన్ దేశానికి అప్పగించాలని కోరింది. అయితే ఈ పాకిస్తాన్…
Taliban refuses female students to leave Kabul for studies: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన ప్రారంభం అయి ఏడాది గడిచింది. 2021 ఆగస్టులో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అప్పటి నుంచి స్త్రీలపై వివక్ష చూపిస్తున్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం అవుతున్నారు. స్త్రీ విద్యను వ్యతిరేకిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్తే ఖచ్చితంగా కుటుంబంలోని మగవాళ్ల తోడు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. షరియా చట్టాన్ని అమలు చేయడానికే తాలిబన్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.
Taliban Urge Hindus, Sikhs To Return: ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిన మైనారిటీలైన హిందువులు, సిక్కులు తిరగి ఆప్ఘాన్ కు రావాలని తాలిబన్లు కోరుతున్నారు. దేశంలో భద్రతాపరమైన అంశాలు పరిష్కరించబడ్డాయని.. తమ మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులు తిరిగి దేశానికి రావాలని కోరారు. తాలిబన్ రాష్ట్ర మంత్రి కార్యాలయం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముల్లా అబ్దుల్ వాసీ జూలై 24న ఆఫ్ఘనిస్తాన్ లోని హిందు, సిక్కు కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. భద్రతా కారణాల వల్ల దేశాన్ని వదిలి…
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అరాచకాలను చూడాల్సి వచ్చింది.. అంతే కాదు.. ఆకలితో అలమటించిపోతున్నారు అక్కడి ప్రజలు.. భారత్ లాంటి దేశాలు ఆదుకోవాడికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక, ప్రభుత్వాన్ని నడపడానికి తాలిబన్లు ఆపసోపాలు పడుతున్నారు.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది తాలిబన్ల పరిస్థితి.. ఎందుకంటే.. తన వద్దనున్న 8 లక్షల డాలర్లను పొరపాటున తన శత్రుదేశమైన తజికిస్తాన్‌కి పంపించారు తాలిబన్లు.. అంటే, ఇది భారత్ కరెన్సీలో రూ.6 కోట్లు అన్నమాట..…
తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ తెలిపారు. ఈ బడ్జెట్ కోసం రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులుసమకూరుస్తున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కూరుకుపోయిన ఆప్ఘాన్‌కు ఈ బడ్జెట్ చాలాముఖ్యమైనది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక చాలా బ్యాంకులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకులు భగ్గుమంటున్నాయి.…
గత ఆగస్టులో తాలిబాన్‌ల వశం అయిన ఆప్ఘన్ తీవ్ర సమస్యలతో సతమతమవుతుంది. ప్రపంచ దేశాలు ఆప్ఘన్‌నుకు సాయాన్ని నిలిపి వేయడంతో అక్కడి తాలిబాన్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేయాలని ప్రపంచ దేశాలకు తాలిబాన్ సహ వ్యవస్థాపకులు, ప్రసుత్త ప్రధాని ముల్లార్ మహమ్మద్ హస్సాన్ అఖుండ్ విజ్ఞప్తి చేశారు. ఆగస్టులో అధికారంలోకి వచ్చాక తొలిసారి చేసిన టెలివిజన్ ప్రసంగంలోనే ఆయన ఈ విజ్ఞప్తి చేయడం విశేషం. ఈ ప్రసంగంలో ‘అన్ని దేశాలకు వాటి…