ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయింది. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తీసుకుని పాలించడం మొదలుపెట్టారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబన్లు హరించివేస్తున్నారనే అపవాదు వచ్చింది. మీడియాపైనా తాలిబన్లు పలు రకాల ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పలువురు పౌరులు దేశాన్ని విడిచి…
తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో లేదో… తమ రాక్షసత్వం ఎలా ఉంటుందో ఆఫ్ఘన్ ప్రజలకు చూపుతున్నారు… తాలిబాన్లు. ముఖ్యంగా పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత… రక్తం ఏరులై పారుతోందా? అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. పంజ్‌షీర్‌లో ఇంటింటి తనిఖీలు చేపట్టి… తమ వ్యతిరేకం అనిపించిన వారిని, మైనార్టీలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను కూడా తాలిబన్లు హతమార్చారు. ఇక, ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే, ఇవాళ జరగాల్సిన…
తాలిబన్లకు ఆడవాళ్లు అంటే చిన్నచూపు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే రాదు.. పలు సందర్భాల్లో ఆడవాళ్లపై వాళ్ల వైఖరిని బయటపెట్టేస్తూనే ఉంటారు.. అయితే, తాలిబన్ల ప్రభుత్వంలోనూ తమకు ప్రాతినిథ్యం కల్పించాలంటూ మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, మహిళలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే కావాలన్నారు. మహిళలు ఎప్పటికీ మంత్రులు కాలేరని… తమ ప్రభుత్వంలో చోటు కల్పించమనన్నారు తాలిబన్లు. ఆయుధాలతో ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. ఆది నుంచి మహిళలనే టార్గెట్…
మేమింతే.. మారేదే లేదు.. తాలిబాన్లు కుండ బద్దలు కొట్టారు . ఆఫ్గనిస్తాన్‌లో షరియా పాలనే సాగుతుందని తేల్చేశారు. అఫ్గానిస్తాన్ ఇకపై అధికారికంగా ‘‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్’’అవుతుంది. తాలిబాన్ల విధానాలు ఎలా వుండబోతున్నాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజా ప్రకటనతో దానికి తెరపడింది. ఇక, ముందు ముందు వాళ్లు ఏం చేస్తారో చూడాల్సివుంది. ఆఫ్గనిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో మళ్లీ ఆక్కడ తాలిబాన్ శకం మొదలైనట్టయింది. ఇకపై తాలిబన్ సుప్రీం లీడర్ మౌల్వీ హిబైతుల్లా…
ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. ఇక, ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు.. ఆ దేశ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే ఈ చర్చ సాగుతోంది.. తాజాగా.. తాలిబన్లకు కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించారు. ఇక, తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంటోంది… తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు…