అఫ్ఘన్లో అమెరికా బలగాల ఉపసంహరణతో ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై పరిపాలనను చేతిలోకి తీసుకున్నారు. తాలిబన్ల పాలనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్థానికులు పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. తాలిబన్లు మాత్రం నిరసనకారులను అణిచివేస్తున్నారు. కాల్పులకు సైతం పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాలనను తమ చేతిలోకి తీసుకున్న తాలిబన్లు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టాలు, హింసకు…
దొంగదెబ్బ.. వెన్నుపోటు. పాకిస్థాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాలిబన్లతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెబుతూనే వాళ్ల తరఫున యుద్ధం చేసేందుకు ఉగ్రవాదులను పంపింది పాక్. పంజ్ షీర్ సింహాలను నేరుగా ఢీకొట్టలేని తాలిబన్లు.. కుట్రలమారి పాకిస్థాన్ అండ తీసుకున్నారు. యుద్ధంలో తామే గెలిచా మని పంజ్ షీర్‌లో జెండా ఎగరేశారు. పంజ్ షీర్ గవర్నర్ బంగ్లా దగ్గర తాలిబన్ నేతలు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని కొండ ప్రాంతంలోని లోయల్లో మాత్రం భీకర యుద్ధం నడుస్తోది. పచ్చటి…
అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఆ దేశం తాలిబన్ల రాజ్యం కావటంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఈ కారణంగా బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అర్షి ఖాన్ తన నిశ్చితార్ధాన్ని రద్దుచేసుకొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో అఫ్గనిస్తాన్ క్రికెటర్‌తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, తన నిర్ణయాన్ని మార్చుకొంది. అయితే నిశ్చితార్థం బ్రేక్ అయినప్పటికీ మేమిద్దరం మంచి మిత్రులుగానే ఉన్నామని ఆమె తెలిపింది. కాగా, ఈ సంక్షోభం ద్వారా…