PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలుపొంది, మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పలు దేశాల అధినేతలు ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక ఇలా పలు దేశాల అధ్యక్షుడు, ప్రధానులు తమ అభినందన సందేశాలను పంపించారు.
తైవాన్ పార్లమెంట్‌లో శుక్రవారం ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని తోపులాటకు దారితీసింది. కొన్ని చట్టాల్లో మార్పులపై వాడివేడిగా చర్చ జరుగుతుండగా.. ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Taiwan: తైవాన్‌పై దండయాత్ర చేయాలని గత కొన్ని రోజులుగా చైనా ప్రయత్నిస్తోంది. తైవాన్‌ని భయపెట్టేందుకు క్రమంగా చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీతో తైవాన్‌ని కవ్విస్తోంది.
తైవాన్‌ను మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఎంత నష్టం జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
తూర్పు ఆసియా దేశం తైవాన్ తీవ్ర భూకంపాలతో వణికిపోతుంది. సోమవారం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించినట్లు పేర్కొన్నారు.
Taiwan Earthquake: తైవాన్ భూకంపం అక్కడి ప్రజలకు పీడకలను మిగిల్చింది. 7.2 తీవ్రవతో వచ్చిన భూకంప ధాటికి చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. 9 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. గత 5 దశాబ్ధాల కాలంగా ఇలాంటి భూకంపాన్ని తైవాన్ వాసులు చూడలేదు.
తైవాన్‌లో సంభవించిన భూకంపం మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. బుధవారం తైవాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Earthquake : తైవాన్‌లో ఈ రోజు (బుధవారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో ద్వీపం మొత్తం వణికిపోయింది. వందలాది భవనాలు కుప్పకూలాయి. జపాన్ దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు సునామీ హెచ్చరిక జారీ చేసింది.