PM Modi: ప్రధాని మోడీకి తైవాన్ అభినందనలు.. ఉడికిపోతున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలుపొంది, మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పలు దేశాల అధినేతలు ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక ఇలా పలు దేశాల అధ్యక్షుడు, ప్రధానులు తమ అభినందన సందేశాలను పంపించారు. తైవాన్ ప్రెసిడెంట్ లై చింగ్-తే కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల విజయంపై నా హృదయపూర్వక అభినందనలు. ఇండోపసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా వాణిజ్యం, సాంకేతికత ఇతర రంగాల్లో మా సహకరాన్ని విస్తరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న తైవాన్-భారత భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మేము ఎదురుచూస్తున్నాం’’ అంటూ తన సందేశాన్ని తెలియజేశారు.
Read Also: Yogi Babu: ఫేస్ బుక్ లవ్.. సినీ ఫక్కీలో తమ్ముడికి సీక్రెట్ గా పెళ్లి చేసిన టాప్ కమెడియన్
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
తైవాన్ ప్రెసిడెంట్ లై శుభాకాంక్షలకు స్పందించిన ప్రధాని మోడీ ‘‘మీ సందేశానికి ధన్యవాదాలు, పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక మరియు సాంకేతిక భాగస్వామ్యానికి కృషి చేస్తున్నందున నేను సన్నిహిత సంబంధాల కోసం ఎదురుచూస్తున్నాను.’’ అని స్పందించారు. అయితే, ప్రస్తుతం భారత్-తైవాన్ మధ్య ఈ వ్యాఖ్యలు చైనాకు రుచించడం లేదు. భారత్ అంటేనే వ్యతిరేకించే చైనా, తనలో భాగమని చెబుతున్న తైవాన్ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలపడంపై ఉడికిపోతోంది.
గురువారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. తైవాన్ ప్రాంతానికి అధ్యక్షుడు ఎవరూ లేరని చెప్పింది. ప్రపంచంలో ‘‘వన్ చైనా’’ విధానం ఉందని, ఇందులో తైవాన్ భాగమని, తైవాన్ చైనాలో విడదీయలేని భాగమని ఆమె చెప్పారు. ‘‘వన్ చైనా’’ విధానం అంతర్జాతీయ సమాజంలో ప్రబలమైన ఏకాభిప్రాయమని మావో నింగ్ అన్నారు. తైవాన్ అధ్యక్షుడికి మోడీ థాంక్స్ చెప్పడంపై చైనా భారత్‌కి తన నిరసన తెలిపింది. భారత్‌కు చైనాతో దౌత్య సంబంధాలు ఉన్నాయని మావో అన్నారు. తైవాన్ అధికారులు మరియు చైనాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న దేశాల మధ్య అన్ని రకాల అధికారిక పరస్పర చర్యలను చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!