Taiwan Earthquake: తైవాన్ భూకంపం అక్కడి ప్రజలకు పీడకలను మిగిల్చింది. 7.2 తీవ్రవతో వచ్చిన భూకంప ధాటికి చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. 9 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. గత 5 దశాబ్ధాల కాలంగా ఇలాంటి భూకంపాన్ని తైవాన్ వాసులు చూడలేదు. ఈ విషాద సమయంలో తైవాన్ ప్రజలకు అండగా ఉంటాని ప్రధాని నరేంద్రమోడీ సంఘీభావం ప్రకటించారు.
ఇదిలా ఉంటే సాధారణంగా భూకంపాలు వచ్చే కొంత సమయం ముందు ఈ విషయాన్ని కుక్కులు, పిల్లలు, పక్షులు వంటివి గ్రహిస్తాయి. భూకంపాల నుంచి వచ్చే తరంగాలను మానవుడు గుర్తించకపోయినప్పటికీ, కొన్ని ప్రాణులు మాత్రం వీటిని ముందే గుర్తించగలవు. తాజాగా తైవాన్ భూకంప సమయంలో ఓ కుక్క ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి, తన యజమానిని అప్రమత్తం చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Read Also: Katchatheevu: కచ్చతీవు వివాదంపై స్పందించిన శ్రీలంక.. ఏం చెప్పిందంటే..?
ఒక చిన్న కుక్క భూకంపానికి కొన్ని సెకన్ల ముందు భయంతో అటూఇటూ పరుగులు తీసింది. సోఫాలో నుంచి నేలపైకి దూకి తన యజమాని ఉన్న గదిలోకి పరిగెత్తుకెళ్లింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ భవనం కంపించడం ప్రారంభమైంది. భూకంపం నుంచి యజమానిని అప్రమత్తం చేసి, రక్షించింది. ఈ వీడియో అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘కుక్కలు నమ్మశక్యం కానీ ఇంద్రియ సామర్థ్యాలను కలిగి ఉన్నాయని తెలిసింది. భూకంపాలు , వాతావరణంలో మార్పులను మానవుడు గ్రహించకముందే వాటిని గుర్తించింది. భూకంపానికి ముందే సూక్ష్మమైన తరంగాలను గ్రహించింది.’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘వావ్.. కుక్కలు నిజంగా మనిషికి మంచి ఫ్రెండ్స్.’’ అని, ‘‘ఇన్‌క్రెడిబుల్’’ అని నెటిజన్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
A dog sensed an earthquake in Taiwan seconds before it happened and alerted its owner..🐕🐾😳 pic.twitter.com/1ELFnyCNts
— 𝕐o̴g̴ (@Yoda4ever) April 3, 2024