తైవాన్‌లో సంభవించిన భూకంపం మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. బుధవారం తైవాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Earthquake : తైవాన్‌లో ఈ రోజు (బుధవారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో ద్వీపం మొత్తం వణికిపోయింది. వందలాది భవనాలు కుప్పకూలాయి. జపాన్ దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు సునామీ హెచ్చరిక జారీ చేసింది.
China: డ్రాగన్ కంట్రీ చైనా రక్షణ బడ్జెట్‌ని పెంచింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, 2024 రక్షణ వ్యయాన్ని పెంచుతామని చైనా మంగళవారం ప్రకటించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) వార్షిక సమావేశ ప్రారంభంలో గత ఏడాది కన్నా 7.2 శాతం పెరుగుదలను ప్రకటించింది. 2024లో రక్షణ బడ్జెట్‌ని 1.665 ట్రిలియన్ యువాన్లు ($231.4 బిలియన్లు) ఖర్చు చేయనుంది.
China: భారత మీడియా తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వుని ఇంటర్వ్యూ చేయడాన్ని డ్రాగన్ కంట్రీ చైనా తప్పుబడుతోంది. ఇది ‘వన్ చైనా’ విధానానికి విరుద్ధమని చెప్పింది. జోసెఫ్ వు తన ఇంటర్వ్యూలో ‘తైవాన్ స్వాతంత్ర్యం’ కోసం వాదించడానికి ఇండియా వేదిక కల్పించిందని భారత్ తోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. అయితే, చైనా వ్యాఖ్యలపై తైవాన్ ఘాటుగానే స్పందించింది. భారత్, చైనా స్వేచ్ఛాయుతమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యయుత మీడియా కలిగిన దేశాలని, చైనాకు భారత్ కానీ, తైవాన్…
China-Taiwan Conflict: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి అయిన లై చింగ్-తే అధ్యక్షుడిగా విజయం సాధించడం డ్రాగన్ కంట్రీకి మింగుడుపడటం లేదు. లీ చింగ్-తే గెలిచినప్పటి నుంచి తైవాన్‌ని బెదిరించేందుకు చైనా ప్రకటనలు చేస్తోంది. చైనా హెచ్చరికలను ధిక్కరిస్తూ.. సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తీవ్రంగా శిక్షించబడుతుందని చైనా విదేశాంగ మంత్రి ఆదివారం హెచ్చరించారు.
China: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాకు వ్యతిరేకిగా పేరొందిన లై చింగ్-తే గెలుపొందడం ఆ దేశానికి మింగుడు పడటం లేదు. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా తైవాన్ జనాలు పట్టించుకోలేదు. వరసగా మూడోసారి అధికార పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఇదిలా ఉంటే ఓటింగ్ ఫలితాలు, తైవాన్ పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP) తైవాన్ లోని ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించదని, తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి చెన్ జిన్హూవా వార్త సంస్థకు చెప్పారు.
చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌లో ఇవాళ జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తైవాన్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని డ్రాగన్ కంట్రీ భావిస్తుంది.
గత కొన్నేళ్లుగా డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం చైనా గూఢచారి బెలూన్ కుంభకోణంతో పాటు తైవాన్‌కు సంబంధించి ఇరు దేశాలు ముఖాముఖిగా విమర్శలు గుప్పించుకున్నాయి.
తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి. మంగళవారం ఉదయం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.