శనివారం నుంచే టీ20 ప్రపంచకప్ పోరు షురూ కానుంది. టోర్నీ మొదలైన రెండో రోజే మహాయుద్ధం జరగనుంది. అదే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్. ఈ పోరు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాయాదుల మధ్య పోరు అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లలో కూడా తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీని పాకిస్థాన్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో…
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ముందడుగు వేసింది. ఎట్టకేలకు గ్రూప్ స్టేజీ నుంచి సూపర్ 12లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో పసికూన పపువా న్యూగునియాపై 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సూపర్ 12లోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మహ్మద్ నయీమ్ డకౌట్ అయినా షకీబ్ (46), లిటన్ దాస్ (29), కెప్టెన్ మహ్మదుల్లా (50) చెలరేగి…
టీ20 ప్రపంచకప్‌లో ఈనెల 24న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లలో పాక్‌పై టీమిండియాకు ఓటమి అన్నదే లేకపోవడంతో ఈసారి ఫలితం ఎలా వస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో తలపడే టీమిండియా డ్రీమ్ ఎలెవన్‌ను భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు. అయితే ఈ జట్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు పఠాన్ చోటివ్వలేదు. ఓపెనర్లుగా…
టీ20 ప్రపంచ కప్‌లో అసలు పోరు ప్రారంభానికి ముందు టీమిండియా అదరగొట్టింది. ఇప్పటికే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్ (1), ఫించ్ (8) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్…
ప్రస్తుతం యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ టోర్నీ తర్వాత టీ20లకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. దీంతో కోహ్లీ తర్వాత భారతజట్టు పగ్గాలు చేపట్టేది ఎవరంటూ కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. కొందరు రోహిత్ అని అంటుంటే.. మరికొందరు రాహుల్‌కు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిక్కుముడికి సమాధానం దొరికేసింది. టీ20లకు భవిష్యత్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని ఓ బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్ అనే ఛానల్‌కు…
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. కాగా అక్టోబరు 14న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని అక్కడి నిర్వాహకులు…
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందో అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. యూఏఈలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా అన్న అంశంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఆడించకుండా ఇషాన్ కిషన్‌ను పరీక్షించారు. ఈ టెస్టులో నూరు శాతం ఇషాన్ పాసయ్యాడు. ముఖ్యంగా…
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆ రెండు విషయాల గురించి నోరుమెదపడం లేదని, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్ లోని భారత భూభాగాన్ని చైనా అక్రమించిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో మన భారత సైనికులు ఉగ్రవాదుల చేతిలో చనిపోతుంటే.. పాకిస్థాన్ తో ఈ నెల 24న టీ20 క్రికెట్…
అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం సాధించిన బంగ్లాదేశ్‌కు స్కాట్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 దశకు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్‌లో స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడిచింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 53పరుగులకే 6వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌ను టెయిలెండర్లు ఆదుకున్నారు. క్రిస్ గ్రీవ్స్ 45, మున్సే 29, మార్క్ వాట్ 22పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో…
అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తుండగా తాజాగా బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించింది. ఇక ఈ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించగా హిట్ మ్యాన్ రోహిత్…