ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆ రెండు విషయాల గురించి నోరుమెదపడం లేదని, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్ లోని భారత భూభాగాన్ని చైనా అక్రమించిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ నిప్పులు చెరిగారు.
కశ్మీర్ లో మన భారత సైనికులు ఉగ్రవాదుల చేతిలో చనిపోతుంటే.. పాకిస్థాన్ తో ఈ నెల 24న టీ20 క్రికెట్ మ్యాచ్ ఆడడం అవసరమా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కశ్మీర్ పౌరుల ప్రాణాలతో పాకిస్థాన్ ఉగ్రవాదులు 20-20 అడుతున్నారని, ఇప్పటికే బీహర్ కు చెందిన కూలీలు 11 మంది ప్రాణాలు బలిగొన్నారన్నారు. ఇవన్నీ చూస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనం పాటిస్తున్నారన్నారు.