టీ20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం సాధించిన బంగ్లాదేశ్‌కు స్కాట్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 దశకు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్‌లో స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడిచింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 53పరుగులకే 6వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌ను టెయిలెండర్లు ఆదుకున్నారు. క్రిస్ గ్రీవ్స్ 45, మున్సే 29, మార్క్ వాట్ 22పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మహేది హసన్ మూడు, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షకిబ్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై లక్ష్యానికి 7పరుగుల దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 134పరుగులే చేయగలిగింది. దీంతో స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో నెగ్గింది. అంతకుముందు జరిగిన మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పపువా న్యూగినియాపై ఒమన్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు వికెట్ కోల్పోకుండా 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఆకిబ్, జితిందర్ సింగ్‌లు పుపువా న్యూగినియా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆకిబ్ 43బంతుల్లో 50 పరుగులు చేయగా.. జితిందర్ సింగ్ 42 బంతుల్లోనే 73 రన్స్ చేశాడు.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు