టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా క్రికెట్ ఫీవర్ నెలకొని ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన పిచ్‌పైనే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. జట్ల వివరాలు భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్,…
టీమిండియా జట్టులో రోహిత్ శర్మకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అతడిపై చాలా అంచనాలున్నాయి. అయితే అతడు చాలా స్పెషల్. ఎందుకంటే 2007లో టీమిండియా ఆడిన ప్రపంచకప్ జట్టులో.. ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న ఒకేఒక్కడు రోహిత్ మాత్రమే. 2007లో 20 ఏళ్ల వయసులోనే రోహిత్ ప్రపంచకప్ ఆడాడు. అప్పుడు జట్టులో అతడే యువకుడు. ఇప్పుడు మాత్రం అతడు…
మరికాసేపట్లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చాలా రోజులుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పోరులో భారత్ గెలవాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేకపూజలు చేస్తున్నారు. పంజాబ్‌లోని లుథియానాలో కొందరు అభిమానులు ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. అంతేకాకుండా భారత టీమ్ సభ్యుల ఫోటోలకు హారతులు కూడా పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ జట్టుపై భారత్ ఓడిపోలేదని.. ఈ మ్యాచ్‌లోనూ అదే రికార్డు కొనసాగించాలని…
నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ తన ఫైనల్ టీంను ప్రకటించింది. (కెప్టెన్)బాబర్ అజామ్, మొహ్మద్ రిజ్వాన్,(కీపర్) ఫకర్ జామన్, మొహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మొహ్మద్ ఆసిఫ్, ఇమాద్ వసీమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది,ఆసిఫ్ అలీతో కూడిన టీం కాగా, బాబర్ ఆజమ్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీలు ప్రధాన బ్యాటర్లుగా బరిలోకి…
మాములుగా పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్‌లంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ. అలాంటిది T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పాక్, ఇండియా టీంలు బలంగా ఉన్నాయి. గత రికార్డుల పరంగా చూసుకుంటే వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఇండియాదే ఆధిపత్యం. ఈ సారి పాక్ విరాట్ కోహ్లినే టార్గెట్ కానున్నాడా.. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఒక్కసారికూడా ఔట్ చేయలేదు. ఆ జట్టుపై కోహ్లీ 2012లో…
టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ అదరగొట్టాడు. గ్రూప్-1లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుత గణాంకాలను నమోదు చేశాడు. 2.2 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన రషీద్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభణతో 14.2 ఓవర్టలో వెస్టిండీస్ 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 56 పరుగుల స్వల్ప విజయలక్ష్యం నిలిచింది. క్రిస్ గేల్ చేసిన 13 పరుగులే వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో అత్యధికం.…
టీ 20 ప్రపంచకప్ అసలు పోరు షురూ అయ్యింది. సూపర్-12 ఓపెనింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదైనా క్రికెట్ ప్రియులకు కావాల్సినంత ఉత్కంఠ లభించింది. అయితే ఒత్తిడికి చిత్తయిన దక్షిణాఫ్రికా చివరకు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అవుతుండటంతో పరుగులు సులభంగా రాలేదు. దీంతో పాటు ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. హేజిల్ వుడ్,…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 ప్రపంచకప్ ఫీవర్ నెలకొంది. ఇప్పటికే అసలు పోరు ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మహా సమరం జరగనుంది. అయితే కొన్ని రికార్డుల గురించి తెలుసుకోవాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువ సార్లు డకౌట్ అయ్యిందో ఎవరో తెలుసుకుందాం పదండి. Read Also: టీమిండియాతో తలపడే పాకిస్థాన్ జట్టు ఇదే టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌లలో పాకిస్థాన్…
టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం రసవత్తర పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే తుది జట్టును పాకిస్థాన్ ఒకరోజు ముందే ప్రకటించింది. 12 మంది సభ్యులతో పాక్ టీమ్ జట్టును ప్రకటించగా.. అందులో బాబర్ ఆజమ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాదాబ్…
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ A నుంచి శ్రీలంక, నమీబియా… గ్రూప్ B నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ సూపర్-12కు అర్హత సాధించాయి. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో నమీబియా సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ జట్టులో పార్ల్ స్టిర్లింగ్ 38…