Tollywood: సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికిగానూ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పీఆర్వో ‘స్వాతిముత్యం’ సంపాదకుడు ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. ‘వాడుక భాషా ఉద్యమ పితామహుడు’ గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని.. ‘శంకరం వేదిక’తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ ఛైర్మన్…
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయంతి .అభిరుచి గల నిర్మాతలు రాజీపడరు. అలాగని కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడరు. ఫలితం ఎలా ఉంటుందో తెలియక పోయినా, తమ అభిరుచికి తగ్గ రీతిన సినిమాలు తెరకెక్కించి, ఆనందిస్తారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగు సినిమా విలువ తరిగిపోతున్న తరుణంలో ‘శంకరాభరణం’ వంటి కళాఖండాన్ని నిర్మించి, జాతీయ స్థాయిలో తెలుగు వెలుగును ప్రసరింపచేశారాయన. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారాయన.…
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘స్వాతి ముత్యం’ ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అమాయకమైన పాత్రలో హీరో కనిపించగా.. కొంచెం…
కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘స్వాతిముత్యం’ సినిమాను ఎవరూ మర్చిపోలేరు. ఇపుడు అదే టైటిల్ తో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.…