Bellamkonda Ganesh Expressed His Happiness Over Swathi Muthyam Success: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన చిత్రం ‘స్వాతిముత్యం’. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాతో బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ హీరోగా, లక్ష్మణ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చింది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా బెల్లం కొండ సురేష్ చిత్ర బృందంతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్రానికి చక్కని విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా అబ్బాయి గణేష్ తో ‘స్వాతిముత్యం’ లాంటి ఒక మంచి సినిమా తీసిన నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, చినబాబు గారికి జీవితాంతం రుణపడి వుంటాను. గణేష్ ని తొలి చిత్రంతో హీరోగా ప్రేక్షకులు ఆదరించడం చాలా ఆనందంగా వుంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టర్ అద్భుతంగా చేశారు. చాలా మంచి కథ, కాన్సెప్ట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘స్వాతిముత్యం’ మరోసారి రుజువుచేసింది. పెద్ద సినిమాల మధ్య వచ్చిన మంచి సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా వుంది. నెమ్మదిగా మొదలైన వసూళ్ళు శుక్రవారం నాటికి అద్భుతంగా పెరిగి స్టడీగా కొనసాగుతున్నాయి. ఈ విజయం నా జన్మలో మర్చిపోలేను. మెగా ప్రేక్షకులకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు” అని అన్నారు.
హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ, ”మంచి సినిమా తీస్తే ఎప్పుడూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారు. పెద్ద సినిమాల మధ్య ‘స్వాతిముత్యం’ చిన్న సినిమాగా వచ్చినప్పటికీ శుక్రవారం నుండి కలెక్షన్స్ మెరుగౌతున్నాయి. తొలి సినిమాకి ఇంత మంచి ఆదరణ నేను ఊహించలేదు. నటుడిగా మంచి పేరు వచ్చింది. మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వగలనని ప్రేక్షకులు ప్రశంసించడం ఆనందంగా వుంది” అని తెలిపారు. దర్శకుడిగా తనకు అవకాశం ఇచ్చిన నాగవంశీ, చినబాబుకు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. రిపీట్ ఆడియెన్స్ వచ్చే సినిమా ఇదని, ఒకసారి చూసిన వారు ఖచ్చితంగా కామెడీని ఎంజాయ్ చేయడానికి మరోసారి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.