తిరుమలలో స్వామిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర ఆలోచనలు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఇందుకు తగ్గట్లుగానే టీటీడీ చర్యలు ఉన్నాయన్నారు. ధరలు పెంచాలన్న నిర్ణయంపై ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యాల కల్పన మీద లేదా..? మళ్లీ దర్శనం ఆలోచన కుటుంబాలకు రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వక కుట్రో టీటీడీ సమాధానం చెప్పాలి. స్వామివారి సేవ, భక్తుల సేవ కాకుండా ఎవరి సేవలో తరిస్తున్నారు. శ్రీవారి దర్శనం…
ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, ఈసారి గవర్నర్ ప్రసంగం లేకపోవడం వివాదాస్పదం అయింది. దీనిపై గవర్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రికి చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, యాదాద్రి ప్రధానాలయంను సందర్శించి, ప్రధాన ఆలయంలో గల స్వయంభు మూర్తులను దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో…
తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో బిజీబిజీగా వున్నారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాథస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాలతో రంగనాథ స్వామి ఆలయ పండితులు సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు తిరుచ్చి కలెక్టర్ శివరాసు,…