తిరుమలలో స్వామిని సామాన్య భక్తులకు దూరం చేసే కుట్ర ఆలోచనలు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఇందుకు తగ్గట్లుగానే టీటీడీ చర్యలు ఉన్నాయన్నారు. ధరలు పెంచాలన్న నిర్ణయంపై ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యాల కల్పన మీద లేదా..? మళ్లీ దర్శనం ఆలోచన కుటుంబాలకు రాకుండా వ్యవహరిస్తున్నారు.
ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశపూర్వక కుట్రో టీటీడీ సమాధానం చెప్పాలి. స్వామివారి సేవ, భక్తుల సేవ కాకుండా ఎవరి సేవలో తరిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు పడే ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఏడాది పాటు ప్లాన్ చేసుకుని వస్తే కొండమీదకు వెళ్లేందుకు అనుమతులు తీసుకోవాలా..? వేసవిలో కనీసం మంచినీళ్లు ఏర్పాటు చేసే తీరిక కూడా లేదా..? అని పయ్యావుల మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా తిరుమలకు వెళ్ళిన భక్తులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. వసతి లేక, దర్శనానికి వెళ్లలేక పిల్లాపాపలతో నరకయాతన అనుభవిస్తున్నారు.
https://ntvtelugu.com/chandrababu-naidu-on-taxes-hike/