ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, ఈసారి గవర్నర్ ప్రసంగం లేకపోవడం వివాదాస్పదం అయింది. దీనిపై గవర్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రికి చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, యాదాద్రి ప్రధానాలయంను సందర్శించి, ప్రధాన ఆలయంలో గల స్వయంభు మూర్తులను దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో కాసేపు పర్యటించి.. విశేషాలు తెలుసుకున్నారు.
యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. యాదాద్రికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశం పెట్టనున్న నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని అని స్వామివారిని కోరుకున్నాను. ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు సంతోషం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. గత రెండు సంవత్సరాలుగా నేను తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యాను అని మంచి అటాచ్మెంట్ మాకు తెలంగాణ ప్రజలతో కలిగిందన్నారు గవర్నర్.