కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ గత యేడాది కరోనా టైమ్ లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. అదే సినిమాను ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సూర్య పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘జై భీమ్’. ఇది సూర్య నటిస్తున్న 39వ చిత్రం. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్య, తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ 2డీ…
తమిళ హీరో సూర్యకు తెలుగునాట కూడా చక్కటి గుర్తింపు ఉంది. తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దక్షిణాదిలో టాప్ స్టార్స్ లో ఒకని గా పేరు తెచ్చుకున్నాడు. తన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు సూర్య. తాజాగా ‘నవరస’తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే సూర్య ట్విట్టర్‌లో 7 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. Read Also :…
దాదాపు 3 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు జడ్జి ఎస్‌ఎం సుబ్రమణ్యం తోసిపుచ్చింది. ఇటీవలే అగ్ర నటులు విజయ్, ధనుష్ తమ లగ్జరీ కార్ల కోసం ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ చేసిన విన్నపాలకు ఇలాంటి సమస్యలోనే చిక్కుకున్నారు. ఈ మూడు కేసుల్లోనూ జడ్జి ఎస్‌ఎం సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 2007-2008, 2008-2009 ఆర్థిక సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుని 2010 సంవత్సరంలో సూర్య…
సూర్య కెరీర్ లోని బెస్ట్ మూవీస్ లో తప్పక చోటు దక్కించుకునే సినిమా ‘పితామగన్’. 2003లో విడుదలైన ఈ రూరల్ డ్రామా మూవీ తెలుగులో ‘శివపుత్రుడు’గా విడుదలైంది. అయితే, బాలా డైరెక్షన్ లో రూపొందిన ఆ సినిమా తరువాత మళ్లీ చాన్నాళ్లకు ఇద్దరూ చేతులు కలపబోతున్నారు. ఈసారి బాలా డైరెక్టర్ గా తిరిగి వస్తుండగా… సూర్య మాత్రం హీరోగా కాక నిర్మాతగా తరలి వస్తున్నాడు. ఆయన తన బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బాలా దర్శకత్వంలో ఓ…
తమిళ స్టార్ హీరో సూర్య 39వ చిత్రం “జై భీమ్”. ఇందులో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం పోరాడే న్యాయవాదిగా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. సూర్య తొలిసారిగా న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నాడు. “జై భీమ్” సామాజిక, రాజకీయ అంశాలతో కథ ముడి పడి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఇందులో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో…
సహజంగా స్ట్రయిట్ సినిమాల్లోని పాటలకు సూపర్ డూపర్ వ్యూస్ లభిస్తుంటాయి. అలానే డాన్స్ నంబర్స్ కూ సోషల్ మీడియాలో వీక్షకుల ఆదరణ లభిస్తుంటుంది. ఇక స్టార్ హీరోల పాటల సంగతి చెప్పక్కర్లేదు. వారి అభిమానులే ఆ పాటలకు మిలియన్ వ్యూస్ రావడానికి కారణమౌతారు. కానీ ఓ తెలుగు డబ్బింగ్ సినిమా పాట పది కోట్ల మంది వీక్షకులను పొందిందంటే అబ్బురమే. ఆ ఫీట్ ను సాధించిన గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్. Read Also : లేడీ…
ప్రముఖ తమిళ నటుడు సూర్య 39వ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ అతని పుట్టిన రోజు సందర్భంగా వెలువడింది. సొంత బ్యానర్ 2 డి ఎంటర్ టైన్ మెంట్ లో టి. జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న చిత్రానికి ‘జై భీమ్’ అనే పేరును ఖరారు చేశారు. రాజీషా విజయన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపిస్తుండటం విశేషం. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన గిరిజనుల హక్కులకై న్యాయపోరాటం చేసే వకీల్…
అమెజాన్ ప్రైమ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ “సూరారై పొట్రు”. సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ హిట్ రీమేక్ లో అక్కడ హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జాబితాలో పలువురు స్టార్ హీరోల పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ స్థానంలో…
తమిళంలో రూపొంది తెలుగులోనూ మంచి మార్కులు సంపాదించిన ‘సూరరై పోట్రు’ సినిమా హిందీ తెర మీదకి వెళుతోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో సూర్య ప్రకటించాడు. అయితే, బాలీవుడ్ వర్షన్ కి కూడా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నప్పటికీ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. సూర్య హిందీ వర్షన్ ‘సూరరై పోట్రు’లో నటించే అవకాశాలు దాదాపుగా లేనట్లే! మరి బీ-టౌన్ లో ‘సూరరై పోట్రు’ కథకి తగిన ఇంటెన్స్ యాక్టర్ ఎవరు? Read Also :…
తొమ్మిది కథల సమాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అందరిలో ఆసక్తి కలిగించిన అంథాలజీ ‘నవరస’. ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో రూపొందిన ఈ అంథాలజీ ఆగస్ట్ 6న ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కాబోతోంది. మానవ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని నవరసాలు అని అంటాం. వీటి ఆధారంగా ‘నవరస’ రూపొందింది. రీసెంట్‌గా విడుదలైన టీజర్ అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కాంబినేషన్ ఈ అంథాలజీపై చాలా ఆసక్తిని పెంచింది.…