తమిళ స్టార్ హీరో సూర్య 39వ చిత్రం “జై భీమ్”. ఇందులో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం పోరాడే న్యాయవాదిగా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. సూర్య తొలిసారిగా న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నాడు. “జై భీమ్” సామాజిక, రాజకీయ అంశాలతో కథ ముడి పడి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఇందులో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సూర్య తన ప్రొడక్షన్ బ్యానర్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “జై భీమ్”కు సంగీతం సీన్ రోల్డాన్, సినిమాటోగ్రఫీ ఎస్ఆర్ కధీర్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ అందిస్తున్నారు. ఈ సినిమా దక్షిణ భారత ప్రధాన భాషల్లో విడుదల చేయబడుతుంది. అయితే “జై భీమ్”ను ఓటిటిలో విడుదల చేస్తారా ? లేదా థియేటర్లలో విడుదల చేస్తారా ? అనేది సూర్య అభిమానులలో పెద్ద ప్రశ్నగా మారింది.
Read Also : “లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ ఫిక్స్ ?
మేకర్స్ పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోకు విక్రయించారు. మహమ్మారి పరిస్థితిని అంచనా వేసిన తరువాత విడుదల ప్రణాళికలపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అయితే సినిమా ఓటిటిలోనే విడుదల కాబోతోంది అని ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే “జై భీమ్” ఓటిటి బాట పట్టనుందా అనే విషయం తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.