జై భీమ్ : రియల్ చినతల్లికి 15 లక్షలు అందించిన సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. 28 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందిన ‘జై భీమ్’ సినిమా అందరి మనసులను కదిలించిన ‘చినతల్లి’ పాత్ర అసలు పేరు పార్వతి. ఆమె ఇప్పటికీ సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య పార్వతికి సహాయం చేయడానికి 10 లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్ చేస్తానని చెప్పారు. నటుడు సూర్య మంగళవారం చెన్నైలో రాజకన్ను భార్య పార్వతిని స్వయంగా కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేశారు. తన తరపున రూ.10 లక్షలు, తన చిత్ర నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ తరపున రూ.5 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. బాలకృష్ణన్, రాజకీయ నాయకత్వ కమిటీ సభ్యుడు జి. రామకృష్ణన్ తదితరులు పాల్గొని నటుడు సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పడం వరకే కాకుండా కొన్ని రోజుల్లోనే చేతల్లో చేసి చూపిన సూర్యపై ఆయన అభిమానులతో పాటు పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!