ముందుగా అనుకున్నట్టుగానే కరోనా మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల కారణంగా బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ తప్పేలా కన్పించటం లేదు. మరో భారీ క్లాష్ కు సౌత్ ఇండస్ట్రీ రెడీ కాబోతోందా ? అనే అవుననే అన్పిస్తోంది. ‘రాధేశ్యామ్’కు గట్టి పోటీ నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య OTT సినిమాలు ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “ఎతర్క్కుం తునింధవన్”తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ యాక్షన్ డ్రామా మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
Read Also : సామ్ టీ షర్ట్ ధర, దానిపై ఉన్న వర్డ్స్ రెండూ షాకింగ్!!
అయితే “ఈటీ” విడుదలైన నెక్స్ట్ డేనే “రాధేశ్యామ్” విడుదల కానుంది. “రాధే శ్యామ్” మేకర్స్ మార్చి 11ను విడుదల తేదీగా లాక్ చేసారని వినికిడి. కానీ ఇప్పుడు సూర్య ‘ఈటీ’ కూడా విడుదలకు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. నిజానికి సూర్య నార్త్ లో, పాన్ ఇండియా రేసులో ఇంకా అడుగు పెట్టలేదు. కానీ ఈ సినిమాతో ఆయన కూడా అక్కడ అదృష్టం పరీక్షించుకోనున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండే సినిమాలతో ప్రేక్షకులను అలరించే సూర్యకు కోలీవుడ్ లో భారీ క్రేజ్ ఉంది. ఆయనకు తెలుగులోనూ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. సూర్య నటించిన చాలా సినిమాలు టాలీవుడ్ లోనూ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రభాస్ కు టాలీవుడ్ లో తిరుగు లేనప్పటికీ సూర్య వల్ల ఎంతోకొంత ఇబ్బందే మరి !