విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం “జై భీమ్” మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సూర్య నటించిన రియలిస్టిక్ మూవీ ఇటీవలే ఆస్కార్‌కి కూడా నామినేట్ అయ్యింది. అలాగే కొద్ది రోజుల క్రితం 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రాన్ని అధికారికంగా ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఈ సక్సెస్ ఫుల్ మూవీకి ఫిలిం నోయిడా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో 3 బెస్ట్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ మూవీ అవార్డుతో పాటు ఈ చిత్రంలో సూర్య, లిజ్మోల్ జోస్ ల అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను కూడా గెలుచుకుంది.
Read Also : హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో
తాజా వార్తతో సూర్య అభిమానులతో పాటు చిత్రబృందం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మణికందన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కూడా సినిమాలో తమ అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. టిజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ డ్రామా ప్రత్యేక ఫీచర్ ఇటీవల ఆస్కార్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో అప్‌లోడ్ చేశారు.