తమిళ స్టార్ హీరో సూర్య 39వ చిత్రం “జై భీమ్”. ఇందులో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం పోరాడే న్యాయవాదిగా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. సూర్య తొలిసారిగా న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నాడు. “జై భీమ్” సామాజిక, రాజకీయ అంశాలతో కథ ముడి పడి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఇందులో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో…
‘సూరరై పోట్రు’తో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన సూర్య మంచి జోష్ లో ఉన్నాడు. కెరీర్ మొదట్నుంచీ ప్రయోగాలకు సై అనే టాలెంటెడ్ హీరో ఈసారి గిరిజన మహిళలపై దృష్టి పెట్టాడట. ‘జై భీమ్’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమాలో 1993 నాటి యదార్థ సంఘటనలు తెరపై కనిపించబోతున్నాయట. చంద్రు అనే లాయర్ చేసిన న్యాయ పోరాటం, దాని వల్ల అమాయక, పేద గిరిజన మహిళలకు కలిగిన లాభం సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారట. ‘సూరరై పోట్రు’ కూడా…
ప్రతిభావంతులను ఆదరించడంలో తెలుగువారు ముందుంటారు. తమిళ స్టార్ హీరో సూర్యను మనవాళ్ళు భలేగా ఆదరిస్తున్నారు. సూర్య నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ, ఇక్కడా విజయం సాధిస్తూనే ఉన్నాయి. ప్రముఖ తమిళనటుడు శివకుమార్ పెద్ద కొడుకు సూర్య. తండ్రి బాటలోనే పయనిస్తూ సూర్య నటనలో అడుగు పెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘నెర్రుక్కు నెర్’ సినిమాతో పరిచయమైన సూర్య, ‘నందా’తో నటునిగా గుర్తింపు సంపాదించారు. ‘కాక్క కాక్క’తో మంచి విజయం చూశారు. ఈ సినిమా…
‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో నటుడిగా మరోసారి తన సత్తా చాటిన సూర్య ఇప్పుడు ‘నవరస’ ఆంధాలజీతో పాటు రెండు ఫీచర్ ఫిల్మ్స్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడి వాసల్’ కాగా, రెండోది పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. శుక్రవారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా అతని 40వ చిత్రం టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించింది. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రానికి ‘ఎదర్కుం తనిందవన్’ అనే పేరు పెట్టారు. విశేషం ఏమంటే……
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘శ్రీ’ చిత్ర సంగీత దర్శకుడు టి. ఎస్. మురళీధరన్ నిన్న చెన్నైలో కన్నుమూశారు. ఈ రోజు ఉదయం అంత్యక్రియలు జరిగాయి. 2002లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘శ్రీ’ తోనే ఆయన సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. పుష్పవాసగన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సూర్య సరసన శ్రుతిక హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ’ మూవీ కమర్షియల్ గా పెద్దంత విజయం సాధించకపోయినా సంగీత దర్శకుడిగా మురళీధరన్ కు మంచి గుర్తింపే…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ జాబితాలో ఓ వెబ్ సిరీస్ కూడా ఉంది. అదే “నవరస”. ఈ వెబ్ సిరీస్ కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ తో పాటు సూర్య… వెట్రి మారన్ “వాడివాసల్”, దర్శకుడు పాండిరాజ్ తో ఓ చిత్రం చేయనున్నారు. దీనిని తాత్కాలికంగా “సూర్య40” అని పిలుస్తున్నారు. శివకార్తికేయన్ “డాక్టర్”తో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పాత్ర కోసం ప్రాణం పెట్టే మనిషి. కెరీర్ ప్రారంభం నుండి అతను చేసిన సినిమాలను గమనిస్తే ఆ విషయం అర్థమౌతుంది. తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించడం కోసం సూర్య ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. మేకప్ పరంగానూ, టెక్నాలజీ సాయంతోనూ వెండితెర మీద భిన్నంగా కనిపించడమే కాదు… స్వయంగా కష్టపడి కూడా తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి సూర్య తపిస్తుంటాడు. త్వరలోనే సూర్య నటించిన వెబ్ సీరిస్ ‘నవరస’…
సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ‘సూరారై పోట్రు’ తమిళంలోనే కాదు ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ అయ్యి, ఓటీటీలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు సూర్య అభిమానులనూ అలరించింది. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను నిర్మించిన సూర్య ఇప్పుడు హిందీలోనూ దీన్ని రీమేక్ చేస్తున్నట్టు తెలిపారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అబుందాంతియా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను…
సౌత్ లో రానురానూ ఓటిటి ప్లాట్ఫామ్ లు ఆదరణ పెరుగుతోంది. తాజాగా మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తమిళ భాషలో రూపొందుతున్న అతిపెద్ద ఓటిటి ప్రాజెక్టు “నవరస” కోసం దిగ్గజ దర్శకులు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ చేతులు కలిపారు. 9 భావోద్వేగాలను, 9 కథల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. Read Also : “మందులోడా”…
సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం.. కేంద్రం అధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయంపై సినీ పరిశ్రమలో అసంతృప్తి రగులుతోంది. దీనిపై సినిమా ప్రముఖులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే దీనిపై తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా స్పందించారు. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.…