ప్రస్తుతం తన ఆస్కార్ ఫీచర్ చిత్రం ‘జై భీమ్’ భారీ విజయంతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు 2022లో అద్భుతమైన లైనప్ ఉంది. సూర్య తాజాగా మాట్లాడుతూ తన ప్రాజెక్ట్ ల గురించి వెల్లడించారు. త్వరలో రజనీకాంత్ ‘అన్నాత్తే’ ఫేమ్ దర్శకుడు శివ, ‘సూరారై పొట్రు’ దర్శకురాలు సుధా కొంగరతో కలిసి నెక్స్ట్ సినిమాలు చేస్తానని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, సూర్య స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాతలు త్వరలో ప్రకటన చేయనున్నారు. సూర్య ఈ మధ్యకాలంలో బలమైన స్క్రిప్ట్‌లు ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నాడు.
Read Also : తమన్నా కొత్త ఛాలెంజ్… ఇట్స్ యువర్ టర్న్
మరోవైపు జ్యోతిక తమ హోమ్ బ్యానర్ 2D ప్రొడక్షన్స్‌లో సామాజిక సంబంధితమైన ఈ చిత్రాలకు సహ-నిర్మాతగా వ్యవహరించి గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ అవార్డ్స్ 2021కి నామినేట్ అయ్యింది. ఇక ఇప్పుడు సెట్స్ పై ఉన్న సూర్య కొత్త ప్రాజెక్ట్ “ఎతర్క్కుం తునింధవన్” షూటింగ్ పూర్తయ్యింది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెల ఫిబ్రవరిలో పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. సూర్య త్వరలో దర్శకుడు బాలాతో వర్క్ చేయనున్నారు. అంతేకాదు సూర్య లైనప్‌లో వెట్రి మారన్‌తో ‘వాడి వాసల్’ అనే ఆసక్తికర ప్రాజెక్ట్ కూడా ఉంది.