Suryakumar Yadav Surgery: టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సర్జరీ సక్సెస్ అయింది. స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య.. శస్త్రచికిత్స కోసం ఇటీవల జర్మనీ వెళ్లాడు. బుధవారం అతడికి వైద్యులు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అతి త్వరలో పునరాగమనం చేస్తా అని పేర్కొన్నాడు. ‘శస్త్రచికిత్స…
Doctor Punches Patient: ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఓ డాక్టర్ విచక్షణ మరిచి ప్రవర్తించాడు. పేషెంట్ తలపై కొట్టాడు. ఈ ఘటన చైనాలో 2019లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఓ సర్జన్ 82 ఏళ్ల వృద్ధురాలికి సర్జరీ చేస్తూ, ఆమె తలపై మూడుసార్లు కొట్టాడు. ఈ ఘటనపై ప్రస్తుతం చైనా అధికారలుు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ముగిసింది. యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. నాలుగు గంటలకు పైగా కేసీఆర్ కు డాక్టర్లు సర్జరీ చేశారు. యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది .ఈ క్రమంలో.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో యశోదా హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.
విమానంలో శ్వాస ఆగిపోయిన రెండేళ్ల చిన్నారి ఓ వైద్య బృందం రక్షించింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోగా.. విమానంలో ఉన్న వైద్యులు వచ్చి పాపకు చికిత్స చేయాలని సిబ్బంది అత్యవసర ప్రకటన చేశారు.
Pooja Hegde: ఈ మధ్య పూజా హెగ్డేకు అసలు కలిసిరావడం లేదనే చెప్పాలి. ఆ మధ్య వరుస హిట్లతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బుట్టబొమ్మ సడెన్ గా వెనుకబడిపోయింది. ఆమె సినిమాలు హిట్ కాకపోవడంతో పూజాను పట్టించుకోవడం మానేశారు దర్శక నిర్మాతలు. ఇక కొన్ని సినిమాలను ఆమెను తీసుకున్నప్పటికీ మధ్యలోనే ఆ సినిమాల నుంచి ఆమె తప్పుకుంది. అయితే పూజానే సినిమాల నుంచి తప్పుకుందో లేక ఆమెను కావాలనే తప్పించారో సరిగా క్లారిటీ లేదు. మహేష్…
తన మొహాన్ని తాను చూసుకోవడానికి విసుగుపడి.. ఓ వ్యక్తి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఘోరాతీ ఘోరంగా.. దారుణంగా తయారైంది. ప్రపంచం మీద ఇలాంటి వింత మనుషులు ఎక్కడో దగ్గర ఉండి ఉంటారు. వారు తమ ముఖాన్ని చూసుకోవడానికి ఇష్టపడక.. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అలా మరింత అందంగా తయారుకావడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు సర్జరీ ఫెయిలై ముఖం పాడవుతుంది. ఇలా తమ ముఖాలను వారే పాడుచేసుకున్న వాళ్లవుతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి.. తనకు…
ఓ వ్యక్తి తన మెదడుకు శస్త్రచికిత్స చేసుకొని ఓ చిప్ ను అమర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ఆ శస్త్రచికిత్స చేసింది డాక్టర్లు కాదు.. తనకు తానే. అవును నిజమే.. అది కూడా ఓ డ్రిల్ మిషన్ సాయంతో. వినడానికి భయంకరంగా ఉన్న తానకు తానే డ్రిల్ మిషన్ తో రంధ్రం చేసుకుని సర్జరీ చేసుకున్నాడు.
ఎండల ప్రభావం ఆపరేషన్లు(సర్జరీ)పై పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యవసర సర్జరీలే చేస్తున్నారు వైద్యులు. మరోవైపు ఎలక్టీవ్ సర్జరీలు నిలిపివేయాలని సర్క్యూలర్ కూడా జారీ అయింది. అయితే ఆపరేషన్ చేసే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బాడీ డీహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. అందుకే అత్యవసరం అయితేనే సర్జరీలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అత్యవసరం కానివి వాయిదా వేయాల్సిన ఆపరేషన్లను ఆపి వేస్తున్నట్లు ఎన్టీవితో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు.
Operation: సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తుంది. కానీ అది సినిమా అని జనాలు మర్చిపోతున్నారు. సినిమాల్లో లాగా చేయాలన్న తాపత్రయంలో కొన్ని సార్లు వాళ్ల ప్రాణాలపైకి తెచ్చుకోవడంతో పాటు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.