Operation: త్రీ ఇడియట్ సినిమా సీన్ రిపీట్.. చనిపోయిన గర్భిణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation: సినిమాల ప్రభావం జనంపై బాగా కనిపిస్తుంది. కానీ అది సినిమా అని జనాలు మర్చిపోతున్నారు. సినిమాల్లో లాగా చేయాలన్న తాపత్రయంలో కొన్ని సార్లు వాళ్ల ప్రాణాలపైకి తెచ్చుకోవడంతో పాటు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఘటనే బీహర్ లోని పూర్ణియా జిల్లాలో జరిగింది. అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ సినిమాలో చూపించిన విధంగా.. నిజ జీవితంలో డార్టర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ నర్సు ఓ గర్భిణికి ప్రసవం చేసి.. ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. మాల్తీ దేవి(22) అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో సోమవారం సాయంత్రం పూర్ణియా లైన్ బజార్లోని సమర్పణ్ ప్రసూతి ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో గైనకాలజిస్ట్ సీమా కుమారి హాస్పిటల్ లో లేరు. ఆమె నగరానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆ మహిళను హాస్పిటల్ మేనేజ్ మెంట్ అడ్మిట్ చేసుకుంది.
Read Also:New York: న్యూయార్క్‌లో తీవ్ర స్థాయిలో కాలుష్యం
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ఈ క్రమంలోనే మాలతికి తీవ్రమైన పురిటినొప్పులు రావడంతో నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. ఓ నర్సుకు ఆపరేషన్ చేయాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆమె డాక్టర్ సీమా కుమారికి వీడియో కాల్ చేసింది. ఆమె సూచనల ఆధారంగా ఆపరేషన్ అయితే పూర్తిచేసింది. మాలతికి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. కానీ ఆ నర్సు ఆమెకు తెలియకుండానే పేషెంట్ కడుపులోని ముఖ్య నరాన్ని కట్ చేసింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారి మరణించింది. ఆ మహిళ జన్మనిచ్చిన ఇద్దరు శిశువులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఖాజాంచి సహాయక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రంజిత్ కుమార్ తన పోలీసు బృందంతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి శాంతిభద్రతలను పునరుద్ధరించారు.
Read Also:Honda Car: హోండాలో ఈ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్..
బాధితురాలి కుటుంబం నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు. దాన్ని పూర్ణియాలోని సివిల్ సర్జన్ ఆఫీసుకు పంపించామని తెలిపారు. ఈ విషయాన్ని పూర్ణియా సివిల్ సర్జన్ దర్యాప్తు చేసి, వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే డాక్టర్, ఆసుపత్రి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఎస్ హెచ్ వో వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో జన అధికార్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ ఎంపీ పప్పుయాదవ్ హాస్పిటల్ కు చేరుకుని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సివిల్ సర్జన్, ఎస్ హెచ్ వోను కోరారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!