Pooja Hegde: ఈ మధ్య పూజా హెగ్డేకు అసలు కలిసిరావడం లేదనే చెప్పాలి. ఆ మధ్య వరుస హిట్లతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన బుట్టబొమ్మ సడెన్ గా వెనుకబడిపోయింది. ఆమె సినిమాలు హిట్ కాకపోవడంతో పూజాను పట్టించుకోవడం మానేశారు దర్శక నిర్మాతలు. ఇక కొన్ని సినిమాలను ఆమెను తీసుకున్నప్పటికీ మధ్యలోనే ఆ సినిమాల నుంచి ఆమె తప్పుకుంది. అయితే పూజానే సినిమాల నుంచి తప్పుకుందో లేక ఆమెను కావాలనే తప్పించారో సరిగా క్లారిటీ లేదు. మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో ఈ ముద్దుగుమ్మ నటించాల్సి ఉంది. ఇప్పటికే మహేష్ సరసన మహర్షిలో నటించి హిట్ కూడా అందుకుంది ఈ చిన్నది. అయితే ఏమయ్యిందో ఏమో కానీ పూజా స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు. అలాగే పవన్ కల్యాణ్ సినిమా నుంచి కూడా పూజా తప్పుకుంది. ఇక ప్రొఫెషనల్ కష్టాలకు తోడు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా పూజాకు జత కట్టాయి.
Also Read: Maharashtra: దారుణం.. ఆ కారణంతో నలుగురు దళితులను చెట్టుకు వేలాడదీసి కొట్టారు
తాజాగా పూజా హెగ్డే కాలికి సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా కాలి నొప్పితో బాధపడుతున్న పూజా తాజాగా నొప్పి మరింత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకోక తప్పలేదట. అయితే ఈ విషయాన్ని పూజా సన్నిహితులు కొందరు ఇండస్ట్రీలోని వారితో పంచుకున్నారు. దాంతో ఈ వార్త బయటకు వచ్చింది. రాధేశ్యామ్, బీస్ట్ సినిమాల షూటింగ్ అప్పుడు కూడా ఆమె కాలి నొప్పితో బాధపడిందట. అయితే అప్పుడు డాక్టర్ సూచనతో కాలికి కట్టు కట్టుకొని జాగ్రత్తగా షూటింగ్ చేసిందట. అయితే ఆ తరవాత కాలి మీద ఒత్తిడి పడటం అంత మంచిది కాదని వైద్యులు చెప్పడంతోనే ప్రస్తుతం సైన్ చేసిన కొన్ని ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకుందట. అంతేకాని తనను ఎవరు తప్పించలేదని టాక్ నడుస్తుంది. అయితే తన కాలికి సర్జరీ జరిగిందని అందరితో పంచుకోవడం పూజాకి ఇష్టం లేదని అందుకే గోప్యంగా ఉంచిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా పూజా కాలికి గాయం అయ్యిందని ఆమెకు సర్జరీ జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆమె సన్నిహితులు ఖండించారు. అయితే ఈసారి ఇంతవరకు పూజాకు సర్జరీ అన్న వార్తపై ఎవరు స్పందించలేదు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.