మీరు ఇస్మార్ట్ శంకర్ మూవీ చూసే ఉంటారు. ఆ సినిమాలో హీరో రామ్ కు తల వెనుక భాగంలో సర్జరీ చేసి ఒక చిప్ ను అమర్చుతారు. ఐతే ఇక్కడ కూడా ఓ వ్యక్తి తన మెదడుకు శస్త్రచికిత్స చేసుకొని ఓ చిప్ ను అమర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ఆ శస్త్రచికిత్స చేసింది డాక్టర్లు కాదు.. తనకు తానే. అవును నిజమే.. అది కూడా ఓ డ్రిల్ మిషన్ సాయంతో. వినడానికి భయంకరంగా ఉన్న తానకు తానే డ్రిల్ మిషన్ తో రంధ్రం చేసుకుని సర్జరీ చేసుకున్నాడు.
World Bank Chief: తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్.. మరో ఐదేళ్లలోనే..!
రష్యాకు చెందిన మైఖేల్ రాదుగా అనే శాస్త్రవేత్త తన వింత ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన బ్రెయిన్ సర్జరీని తానే చేయించుకున్నాడు. ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన మెదడులో చిప్ ఉంచాడు. ఆ చిప్ సహాయంతో అతను తన కలలను నియంత్రించుకోగలనని పేర్కొన్నాడు. షాకింగ్ విషయం ఏమిటంటే.. మైఖేల్‌కు న్యూరోసర్జరీకి సంబంధించిన ఏబీసీడీ కూడా తెలియదు. అయినప్పటికీ.. అతను తన గదిలోనే సర్జరీ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ సర్జరీ చేయడానికి మైఖేల్ కు 10 గంటలు పట్టింది. అంతేకాకుండా ఒక లీటరు రక్తం పోయినట్లు ఆయన చెప్పారు. తనకు న్యూరో సర్జరీకి సంబంధించి ఏమీ తెలియనప్పటికీ.. డ్రిల్ మెషీతో తన తలకు రంధ్రం చేసి చిప్‌ను అమర్చారు.
TS BJP: రాష్ట్రంలో బైపోల్ ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది.. కాంగ్రెస్ కాదు..!
ఆ సర్జరీ చేస్తున్నప్పుడు రక్తం బాగా పోయినప్పటికీ.. మొదట భయపడ్డాడని పరిశోధకుడు చెప్పారు. సర్జరీ మధ్యలో స్పృహతప్పి పడిపోతాడేమోనని భయపడ్డాడు. కానీ అంతా బాగానే జరిగింది. మెదడులో చిప్ ను అమర్చడం ద్వారా అతను స్పష్టమైన కలని నియంత్రించాలనుకుంటున్నట్లు మైఖేల్ చెప్పాడు. తన పరిశోధన ఏదో ఒకరోజు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మైఖేల్ అభిప్రాయపడ్డాడు. అందుకే ఈ ప్రమాదకరమైన సర్జరీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. అయితే.. మైఖేల్ లాగా తమంతట తాముగా ఇలాంటి పనులు చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.