తన మొహాన్ని తాను చూసుకోవడానికి విసుగుపడి.. ఓ వ్యక్తి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఘోరాతీ ఘోరంగా.. దారుణంగా తయారైంది. ప్రపంచం మీద ఇలాంటి వింత మనుషులు ఎక్కడో దగ్గర ఉండి ఉంటారు. వారు తమ ముఖాన్ని చూసుకోవడానికి ఇష్టపడక.. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. అలా మరింత అందంగా తయారుకావడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు సర్జరీ ఫెయిలై ముఖం పాడవుతుంది. ఇలా తమ ముఖాలను వారే పాడుచేసుకున్న వాళ్లవుతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి.. తనకు నీరసం వచ్చిందని.. సర్జరీలు చేయించుకుని తన ముఖాన్ని తానే చూడలేని దీనాస్థితిలోకి వెళ్లాడు.
Jaipur Train Firing: జైపూర్ ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మృతి
తన ముఖాన్ని తానే పాడుచేసుకున్న ఆ వ్యక్తి పేరు లెవీ జెడ్ మర్ఫీ. అతను ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నివసిస్తున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం.. లెవి జెడ్ శస్త్రచికిత్స చేసుకోవడానికి ఇష్టపడతాడని తెలిపారు. అతనికి ఎప్పుడు నీరసం వచ్చినా వెంటనే వెళ్లి సర్జరీ చేయించుకునేవాడు. అతను 19 ఏళ్ల వయసు నుంచే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నాడని.. తన ముఖాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు ఈ సర్జరీలన్నీ చేసుకున్నట్లు లెవీ చెప్పారు. ప్రస్తుతం లెవీ వయసు 26 ఏళ్లు ఉండగా.. ఇప్పటి వరకు 15 బ్యూటీ ట్రీట్‌మెంట్లు తీసుకుని రూ.52 లక్షలకు పైగా ఖర్చు చేశాడు.
China: బీజింగ్‌లో భారీ వర్షాలు.. 11 మంది మృతి
నోటిలోని కొవ్వును తొలగించడం కోసం ముక్కుకు సర్జరీ, పెదవులు మందంగా మారడం కోసం సర్జరీ.. ఇలా అనేక రకాల సర్జరీలను లెవీ చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అతనికి ఓ పిచ్చి ఉంది.. నీరసం వచ్చినప్పుడల్లా.. సర్జరీ చేసుకున్నట్లు చెప్పారు. సర్జరీ చేయించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని లెవీ చెప్పారు. అంతేకాకుండా.. తన ముఖం కూడా బోర్ కొడుతుందని, అందుకే ఎప్పటికప్పుడు రకరకాల సర్జరీలు చేసుకుంటూ ముఖం మార్చుకుంటూ ఉంటానని అంటున్నాడు. ప్రస్తుతం శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలలో.. సర్జరీ చేయడం వల్ల పెదవులతో సహా ముఖం మొత్తం వాచిపోయింది. కళ్లు తెరవడం కూడా కష్టంగా మారింది. మీరు ఆ ఫొటోలు చూస్తే షాక్ కు గురవుతారు.