Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే, ఈ కేసును ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.
Read Also: Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ‘డుంకీ’ని ‘డాంకీ’ చేసారు… దెబ్బకి సోషల్ మీడియాలో ఇండియా వైడ్ ట్రెండ్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా.. ఏపీ ప్రభుక్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోత్గీ వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరతూ చంద్రబాబు పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా కేసు నమోదు చేశారని ఈ పిటిషన్‌లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తిరస్కరిస్తూ.. ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు తరపున లాయర్లు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: MS Dhoni New Look: ఎంఎస్ ధోనీ ‘వింటేజ్’ లుక్.. మహేష్ బాబునే డామినేట్ చేశాడుగా!
అయితే, ఏపీ హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు వెళ్లింది.. అయితే విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకోవడంతో.. అదే రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావన తీసుకువెళ్లారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..