Chandrababu Case: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.. క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.. అయితే, వాదనల సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇంకా ఎంత సేపు వాదనలు వినిపిస్తావని చంద్రబాబు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ని ప్రశ్నించారు జస్టిస్ బోస్… నీ సహచరులు వాదనలు వినిపించడానికి ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు జస్టిస్ బోస్. అయితే ఒక గంట పాటు వాదనలు వినిపిస్తానని సాల్వే బదులిచ్చారు.. ఇక, అలా అయితే, తర్వాత వస్తాను.. మూడు రోజులుగా ఎదురు చూస్తున్నామన్న ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు ఇనిపిస్తున్న ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు.. ఇలాంటి కేసుల్లో నోటీస్ జారీ చేయాలా వద్దా అనే విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.. పూర్తిగా ఇది అభ్యంతరకపమైన కేసు అన్నారు రోహత్గీ.. అయితే, చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని వాదనలు వినిపించారు హరీష్ సాల్వే.. ఇక, లంచ్ వరకు ఈ కేసు లో వాదనలు వింటామన్నారు జస్టిస్ బోస్.. ఆ తర్వాత మిగిలిన కేసులు విచారణ చేస్తామన్నారు.. అయితే, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హరీష్ సాల్వే వాదనలు పూర్తి కాగా.. ముకుల్ రోహత్గీ తన వాదనలు ప్రారంభించారు.