K.Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తనపై ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేయాలని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆమెకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్ ఎవరైనప్పటికీ ఒకే విధానాన్ని అనుసరిస్తామని వ్యాఖ్యానించింది. 6 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అంగీకరించబోమని తేల్చిచెప్పింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆమెను సూచించింది. బెయిల్ కోసం ఎవరైనా ముందుగా కింది కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించి విజయ్ మదన్ లాల్ అరెస్టు చట్ట విరుద్ధమని కవిత లేవనెత్తిన అంశాలను ధర్మాసనం గతంలో జతపరిచింది.
Read also: MS Dhoni: ఐపీఎల్లో ధోని ఆడటంపై అనుమానాలు.. సీఎస్కే ఏం చెప్పిందంటే..?
రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారిస్తామని పేర్కొంది. ఇదే అంశంపై దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేస్తామని చెప్పిన ధర్మాసనం… ఈడీకి నోటీసులు జారీ చేసింది. కేసు మెరిట్‌లోకి వెళ్లదని ఇప్పుడు స్పష్టమైంది. సుప్రీంకోర్టులో కవిత తరపున కపిల్ సిబల్ వాదించారు. కాగా, ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Plane Crash: విమానం కూలిపోవడానికి సెకన్ల ముందు షాకింగ్ ఘటన.. చివరకి..?