Kejriwal: కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ విషయంలో ఆయనకు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధినేతగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కేజ్రీవాల్ కోరారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది అసాధారణ పరిస్థితి అని.. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించింది. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని… లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి కాబట్టి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Radhika Khera: కాంగ్రెస్ వేధింపుల కారణంగా బీజేపీలో చేరిన రాధికా ఖేరా..
Also Read
అయితే సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని.. కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదని తెలిపింది. ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఈ కేసులో కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించలేదని పేర్కొంది. 9 సమన్లను పట్టించుకోలేదని.. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి తెలిపింది.
ఇది కూడా చదవండి: CM YS Jagan: తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు..!
అనంతరం కేజ్రీవాల్ తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. ఒకవేళ ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోమని.. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని అభిప్రాయపడింది. బెయిల్‌పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వచ్చే గురువారం లేదా నెక్ట్స్ వీక్ వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Rain forecast: బెంగళూరు ప్రజలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ..
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైల్లో పెట్టారు. తాజాగా మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!